నైజీరియన్లు పిజ్జాలను విమానాల్లో తెప్పించుకుంటున్నారు... నైజీరియా మంత్రి కామెంట్లపై దుమారం

Nigeria : ఆఫ్రికాలోని అత్యంత పేద దేశాల్లో నైజీరియా ఒకటి. అక్కడ చాలా మంది తినడానికి తిండి కూడా లేక... ఆకలితో అలమటిస్తున్నారు. పౌష్టికాహార లోపం చాలా ఎక్కువగా ఉంది.

news18-telugu
Updated: April 3, 2019, 7:31 AM IST
నైజీరియన్లు పిజ్జాలను విమానాల్లో తెప్పించుకుంటున్నారు... నైజీరియా మంత్రి కామెంట్లపై దుమారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆఫ్రికా దేశం నైజీరియాలో ప్రజల ఆహారపు అలవాట్లపై రాజకీయ కలకలం రేగింది. ఎక్కడో 4000 మైళ్ల (6437 కిలోమీటర్లు) దూరంలో ఉన్న బ్రిటన్‌లో పిజ్జాలు కొనుక్కొని... వాటిని విమానాల్లో తెప్పించుకొని నైజీరియాలో తినడంపై ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి అభ్యంతరం తెలిపారు. ఇలా విదేశాల నుంచీ విపరీతంగా ఆహారాన్ని దిగుమతి చేసుకొని తినడాన్ని ప్రజలు స్టేటస్ సింబల్‌లా భావిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి ఆదు ఒగ్బే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయాన్నే లండన్‌లో పిజ్జా కొని... బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో దాన్ని తెప్పించుకొని... నైజీరియా రాజధాని అబూజా ఎయిర్ పోర్ట్‌లో దాన్ని తిరిగి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. బియ్యం మొదలు టమాటా పేస్ట్ వరకూ... ప్రతీదీ విదేశాల నుంచీ దిగుమతి చేయించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి చర్యల్ని ఖండించాలన్న ఆయన... ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆదు ఒగ్బే వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో దుమారం రేగింది. బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఏమైనా నైజీరియాకి పిజ్జా డెలివరీ సర్వీస్ ప్రారంభించిందా? ఇందుకు సంబంధించి ఏదైనా యాప్ ఉందా? అని ఓ నెటిజన్ సెటైరికల్ ట్వీట్ చేశారు.

nigeria,nigerian,nigerian movies,nigeria news,latest nigerian movies,nigerian movies 2017,lagos nigeria,nigeria vlog,2017 nigerian movies,facts on nigeria,nigeria,africa,nigeria civil war,nigerian music,nigerian comedy,niger delta,nigerian movies 2018,2018 latest nigerian movies,nigeria oil,nok nigeria,nigeria 2018,nigerians,nigeria naija,abuja nigeria,nigeria facts,facts nigeria,benin nigeria,life in nigeria,నైజీరియా,పిజ్జా,బ్రిటీష్ ఎయిర్ వేస్,
నైజీరియాలో పౌష్టికాహార లోపం

వాస్తవానికి నైజీరియా వ్యవసాయ శాఖ మంత్రి అన్న మాటల్లో కొంతవరకూ నిజం ఉంది. ఆఫ్రికాలోని అత్యంత పేద దేశాల్లో నైజీరియా ఒకటి. అక్కడ చాలా మంది తినడానికి తిండి కూడా లేక... ఆకలితో అలమటిస్తున్నారు. పౌష్టికాహార లోపం చాలా ఎక్కువగా ఉంది.

nigeria,nigerian,nigerian movies,nigeria news,latest nigerian movies,nigerian movies 2017,lagos nigeria,nigeria vlog,2017 nigerian movies,facts on nigeria,nigeria,africa,nigeria civil war,nigerian music,nigerian comedy,niger delta,nigerian movies 2018,2018 latest nigerian movies,nigeria oil,nok nigeria,nigeria 2018,nigerians,nigeria naija,abuja nigeria,nigeria facts,facts nigeria,benin nigeria,life in nigeria,నైజీరియా,పిజ్జా,బ్రిటీష్ ఎయిర్ వేస్,
బోకోహారం ఉగ్రవాదులు

నైజీరియాలో ఉన్న మరో పెద్ద సమస్య బోకోహారం ఉగ్రవాద సంస్థ. అది చేస్తున్న అరాచకాలతో అభివృద్ధి అన్నదే లేకుండా పోయింది. ప్రజలను గుంపులు గుంపులుగా చంపుతూ ఆ సంస్థ నైజీరియాకు శనిలా దాపురించింది.

ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు... దేశ ప్రజలు విదేశాల నుంచీ కాకుండా... దేశంలో ఆహార ఉత్పత్తులపైనే ఆధారపడితే... అది దేశ అభివృద్ధికి దోహద పడుతుందన్నది వ్యవసాయ శాఖ మంత్రి ఆలోచనగా తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి :

ఒక్కో జన్ ధన్ ఖాతాలో రూ.10,000... ఎలా వచ్చాయి... ఎవరు వేశారు? దర్యాప్తు చేస్తున్న ఈసీ

టాలీవుడ్‌ నటులను కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా... చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజమెంత?

నారా లోకేష్ నకిలీ... జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఫ్యూచర్... రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్

రిటర్న్ గిఫ్టుకీ రూ.1000 కోట్లకీ సంబంధమేంటి... టీడీపీ నేతలు ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే
First published: April 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>