నైజీరియాలో బొకో హరమ్ మారణహోమం.. ఆత్మాహుతి దాడుల్లో 30మంది మృతి

Nigeria Suicide Blast : దాడిలో దాదాపు 30 మంది అక్కడికక్కడే చనిపోగా మరో 40మంది తీవ్రంగా గాయపడ్డారు.గతేడాది జులైలోనూ ఇదే ప్రదేశంలో ఆత్మాహుతి దాడి జరిగి 8 మంది చనిపోయారు.

news18-telugu
Updated: June 17, 2019, 6:40 PM IST
నైజీరియాలో బొకో హరమ్ మారణహోమం.. ఆత్మాహుతి దాడుల్లో 30మంది మృతి
(బాంబు దాడులకు తెగబడ్డ బొకోహారం, (Image for representation only. AP photo))
news18-telugu
Updated: June 17, 2019, 6:40 PM IST
నైజీరియాలో బొకోహారం తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.బోర్నో రాష్ట్రం కొందుగ గ్రామంలో బిగ్ స్క్రీన్‌పై ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న క్రీడాభిమానులపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.దాడిలో దాదాపు 30 మంది అక్కడికక్కడే చనిపోగా మరో 40మంది తీవ్రంగా గాయపడ్డారు.గతేడాది జులైలోనూ ఇదే ప్రదేశంలో ఆత్మాహుతి దాడి జరిగి 8 మంది చనిపోయారు.తాజా ఆత్మాహుతి పేలుళ్లపై స్థానిక భద్రతా దళ అధికారి ఒకరు స్పందించారు.

బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసిన హాల్‌లోకి మొత్తం ముగ్గురు ప్రవేశించడానికి యత్నించగా.. అందులో ఒకరిని ఆ హాల్ యజమాని
అడ్డుకున్నట్టు తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అతను అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నట్టు చెప్పాడు.మరో ఇద్దరు

హాల్‌లోకి చొరబడి ఆత్మాహుతికి పాల్పడినట్టు సమాచారం.ఘటనపై ఇప్పటికైతే బొకోహారం నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.కాగా, నైజీరియాలో బొకోహారం సృష్టిస్తున్న మారణహామానికి ఇప్పటివరకు దాదాపు 27వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బొకోహారం ఆగడాలను భరించలేక దాదాపు 10లక్షల మంది తమ ఇళ్లను విడిచి పారిపోపయారు.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...