పార్లమెంట్‌లో ఎంపీ బిడ్డకు పాలుపట్టిన స్పీకర్..సభ జరుగుతుండగానే..

బాబు తండ్రి కాఫే చర్చలో బిజీగా ఉండడంతో అది గమనించిన స్పీకర్ మలార్డ్..బిడ్డను దగ్గరకు తీసుకొన్నాడు. స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆ శిశువుకు పాలుబట్టాడు.

news18-telugu
Updated: August 21, 2019, 10:51 PM IST
పార్లమెంట్‌లో ఎంపీ బిడ్డకు పాలుపట్టిన స్పీకర్..సభ జరుగుతుండగానే..
పార్లమెంట్‌లో ఎంపీ బిడ్డకు పాలుపట్టి, లాలించిన న్యూజిలాండ్ స్పీకర్
  • Share this:
కొందరు నేతలుంటారు..! పదవి రాగానే అధికార దర్పం పదర్శిస్తారు. తామే తోపులమన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు. కానీ ఇంకొందరు నేతలుంటారు..! ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. అత్యున్నత పదవిలో ఉన్నా అతి సామాన్యుడిలాగే ఉంటారు. నలుగురితో కలిసి నవ్వుతూ ఉంటారు. ఎక్కడ నెగ్గాలో కాదు...ఎక్కడ తగ్గాలో వారికి పక్కాగా తెలుసు. అలాంటి కోవలోకే వస్తారు..న్యూజిలాండ్ పార్లమెంట్ స్పీకర్ ట్రెవర్ మలార్డ్..! పార్లమెంట్‌లో ఎంపీ బిడ్డకు పాలుపట్టి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఆకలితో ఉన్న పసివాడికి పాలు తాగించి అందరి మన్ననలు పొందారు.

ఎంపీ టామాటి కాఫే తన మగబిడ్డతో బుధవారం పార్లమెంటు సభలకు హాజరయ్యారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆ బాబు ఏడవడం మొదలుపెట్టాడు. ఆకలి వేయడంతో బిగ్గరగా ఏడ్చాడు. మరోవైపు బాబు తండ్రి కాఫే చర్చలో బిజీగా ఉండడంతో అది గమనించిన స్పీకర్ మలార్డ్.. ఆ చిన్నారిని దగ్గరకు తీసుకొన్నాడు. స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆ శిశువుకు పాలుబట్టాడు. ఆ ఫొటోలను స్పీకర్ మలార్డ్ ట్విటర్‌లో షేర్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. పసిబిడ్డకు పాలు పట్టించిన స్పీకర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. కాగా, ఎంపీ టామాటి కాఫే దంపతులకు జులైలో మగబిడ్డ పుట్టాడు. సరోగసీ విధానంలో ఆ బాబు జన్మించాడు.First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>