New Zealand parliament: టై కట్టుకోలేదని పార్లమెంట్ నుంచి ఓ ఎంపీని బయటకు పంపించేశారు..!

పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయిన న్యూజిల్యాండ్ ఎంపీ

ఓ దేశ పార్లమెంట్ లో ఓ విచిత్ర కారణంతో ఓ ఎంపీని సభ నుంచి బహిష్కరించారు. డ్రస్ కోడ్ పాటించనందుకు ఆ ఎంపీని చట్ట సభ నుంచి బయటకు పంపించేశారు. న్యూజీల్యాండ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    పార్లమెంట్లో ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతలో, లేదా ఆ చర్చ జరగడం ఇష్టం లేని పార్టీ నేతలో నానా రభస సృష్టిస్తుంటారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ధర్నాలు చేస్తుంటారు. అరుపులు, కేకలతో సభ హోరెత్తిపోతుంటుంది. తమ వద్ద ఉన్న కాగితాలను చించి పైకి విసిరేస్తుంటారు. స్పీకర్ మైకును లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. గతంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఇలా చట్టసభల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కొద్ది రోజుల పాటు సస్పెన్షన్ విధిస్తుంటారు. పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాలను చూస్తున్న వారికి ఇవన్నీ సాధారణ సంఘటనల్లాగే కనిపిస్తాయి. కానీ ఓ దేశ పార్లమెంట్ లో ఓ విచిత్ర కారణంతో ఓ ఎంపీని సభ నుంచి బహిష్కరించారు. డ్రస్ కోడ్ పాటించనందుకు ఆ ఎంపీని చట్ట సభ నుంచి బయటకు పంపించేశారు. న్యూజీల్యాండ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    రవైరీ వైటిటీ అనే ఎంపీ న్యూజీల్యాండ్ లో మేజర్ పార్టీలో ఓ ప్రధాన నేత. మంగళవారం ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. చర్చలో భాగంగా ఓ ప్రశ్నను అడిగేందుకు తన సీటు నుంచి పైకి లేచారు. స్పీకర్ ఆయన్ను కూర్చోమన్నారు. కొద్ది సేపటి తర్వాత మరోసారి ప్రశ్నను అడిగేందుకు పైకి లేచారు. ’మీకు ప్రశ్నలు అడిగే హక్కు లేదు. ఈ సభ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నా‘ అని స్పీకర్ తేల్చిచెప్పేశారు. దీంతో ఆ సభలో ఒక్కసారిగా నిశ్శబ్ధం ఆవహించింది. మన దేశంలో అంటే పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురవడాన్ని సాధారణంగానే చూస్తుంటారు. కానీ న్యూజీల్యాండ్ లో అలాంటి ఘటనలు జరగడం చాలా చాలా అరుదు.



    ’మీరు పార్లమెంట్ నిబంధనలకు అనుగుణంగా డ్రెస్ కోడ్ ను పాటించలేదు. ప్రత్యేకించి మీరు టై కట్టుకోలేదు. ఏదో నెక్లెస్ లాంటిది వేసుకొచ్చారు. అందువల్ల మిమ్మల్ని పార్లమెంట్ నుంచి బయటకు పంపిస్తున్నాం‘ అని స్పీకర్ వ్యాఖ్యానించారు. దీంతో పార్లమెంట్ నుంచి బయటకు వచ్చిన రవైరీ వైటిటీ మీడియాతో మాట్లాడారు. ’ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ను స్పీకర్ అమలు చేస్తున్నారు. నా ఇష్టానికి అనుగుణంగా టై కట్టుకోకుండా నేను ఆ లాకెట్ (హై టికీ) వేసుకున్నాను. ఆ లాకెట్ మా సంస్కృతికి సంబంధించినది. దీన్ని ఆయన ఎలా తప్పుపడతారు?‘ అని వరైరీ వైటిటీ వ్యాఖ్యానించారు.
    Published by:Hasaan Kandula
    First published: