Home /News /international /

NEW YORK POLICE SHOOTS GUNMAN WHO OPENED FIRE AT CHRISTMAS CONCERT KRS

Gunfire at Christmas concert: క్రిస్మస్ కాన్సెర్ట్​లో కాల్పులతో ఆగంతకుడి కలకలం.. ఆ తర్వాత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్​(New York) లోని చర్చి ఆవరణలో క్రిస్మస్ కాన్సెర్ట్ పూర్తయ్యాక ఆగంతకుడు కాల్పులు జరిపాడు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకవడంతో అందరూ ఊపిరి పీల్చుకు​న్నారు.

    అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. క్రిస్మస్ సమీపిస్తుండడంతో వేడుకలు జరుగుతున్న వేళ అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. న్యూయార్క్​ లోని ఓ చర్చిలో ఆగంతకుడు ఈ కాల్పుల బీభత్సాన్ని సృష్టించాడు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జరిగిన కాన్సెర్ట్ అనంతరం తుపాకీతో కాల్పులు జరిపాడు.  దీంతో పోలీసులు అతడిని కాల్చారు. న్యూయార్క్​లోని మాన్​ హాటన్​ కాథడ్రిల్ చర్చి సెయింట్ జాన్ డివైన్​ లో ఈ ఘటన జరిగింది.

    ఆగంతుకుడు పోలీసులపై కాల్పులు జరిపాడని, అయితే ఎవరికి ఏమీ కాలేదని న్యూయార్క్ సిటీ పోలీసు శాఖ ప్రతినిధి సెర్గెంట్​ ఎడ్వర్డ్​ రిలే చెప్పారు.  అలాగే నిందితుడి వివరాలు తెలియలేదని, అతడిని ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు.

    గాన విభావరి(కాన్సెర్ట్​) తర్వాత సెయింట్ జాన్​ ది డివైన్​ క్యాథడ్రిల్ చర్చి నుంచి ప్రజలు బయటికి వచ్చారు. ఆగంతుకుడు కాల్పులకు తెగబడిన సమయంలో అక్కడ పదుల సంఖ్యలో ప్రజలు గుమికూడి ఉన్నారు.

    కాల్పులు జరిపిన సమయంలో నల్లని వింటర్ కోట్​, బేస్ బాల్ స్టైల్ క్యాంప్​ తో పాటు ఫేస్ మాస్క్​ను ఆ ఆగంతకుడు ధరించాడని అక్కడి ఫొటోగ్రాఫర్ తెలిపాడు. డొమినికన్ రిపబ్లిక్ జెండాను సైతం పట్టుకున్నాడట. అలాగే రెండు చేతుల్లో రెండు తుపాకీలతో పాటు భుజానికి బ్యాగ్​ తో ప్రజలను ఆగంతకుడు భయాందోళనకు గురి చేశాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడం అదృష్టం.

    మరోవైపు అమెరికాలో ఈ ఏడాది  క్రిస్మస్ వేడుకలపై కరోనా వైరస్ ప్రభావం చూపే అవకాశం ఉంది. అగ్రరాజ్యంలో ఇప్పటికీ భారీగా కేసులు నమోదవుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ దశలో రోజుకు వేల కేసులే వస్తుండగా.. తాజాగా లక్షల మంది కరోనా బారీన పడుతున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు కోటీ 64 లక్షల మందికి కరోనా సోకగా.. మరణాలు 3 లక్షలకు చేరువయ్యాయి.
    Published by:Krishna P
    First published:

    Tags: Gunman attack, New york, Us

    తదుపరి వార్తలు