హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

New WHO Data : ప్రపంచంలో స్వచ్ఛమైన గాలి పీల్చుతోంది ఎందరో తెలుసా

New WHO Data : ప్రపంచంలో స్వచ్ఛమైన గాలి పీల్చుతోంది ఎందరో తెలుసా

వాయు కాలుష్యం

వాయు కాలుష్యం

Unhealthy Air :పట్టణ ప్రాంతాల్లో గాలి కాలుష్యం సర్వసాధారణంగా ఉందని..ఈ కాలుష్య గాలిని పీల్చడం వల్ల ఆస్తమా,దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వ్యాధుల బారిన పడుతున్నారని WHO నివేదికలో వివరించింది. భారత్‌ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే కర్బన ఉద్గారాల స్థాయిల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని, పర్యావరణహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించింది.

ఇంకా చదవండి ...

Unhealthy Air :వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)గాలి నాణ్యతకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఓ రిపోర్ట్ లో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 6,000 కంటే ఎక్కువ మున్సిపాలిటీలలో గాలి నాణ్యతకు సంబంధించి సర్వే చేసి ఓ నివేదికను విడుదల చేసింది WHO.ప్రపంచంలోని 99 శాతం జనాభా కలుషిత గాలి పీలుస్తున్నారని ఆ రిపోర్ట్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు జనాభా మొత్తం ప్రమాణాలకు తగినట్లుగా లేని గాలినే పీలుస్తున్నారని, దీన్ని నివారించాలంటే వెంటనే శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలని సూచించింది. ఈ ఇంధన వాడకాలతో వాయుకాలుష్యం ఏర్పడుతోందని, దీనివల్ల రక్త సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ప్రబలి ప్రతి సంవత్సరం 70 లక్షల మరణాలు సంభవించి ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యావరణ, వాతావరణ మార్పు, ఆరోగ్య విభాగం అధిపతి డాక్టర్ మరియా నీరా అన్నారు. అలాగే ఈ పరిశోధనలు వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మార్పులు చేయడానికి పనికొస్తాయని ఢిల్లీలోని వాయు కాలుష్య నిపుణుడు అనుమితా రాయ్‌చౌదరి అన్నారు.

తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉందని.. ఆ తర్వాత ఆఫ్రికాలో తక్కువ ఉందని ఈ నివేదికలో WHO తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో గాలి కాలుష్యం సర్వసాధారణంగా ఉందని..ఈ కాలుష్య గాలిని పీల్చడం వల్ల ఆస్తమా,దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వ్యాధుల బారిన పడుతున్నారని WHO నివేదికలో వివరించింది. భారత్‌ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే కర్బన ఉద్గారాల స్థాయిల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని, పర్యావరణహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించింది. గాల్లో పీఎం 2.5, పీఎం10 అనే పర్టిక్యులేట్‌ మేటర్‌ను ఆధారంగా చేసుకొని వాయునాణ్యతను సంస్థ నిర్ధారిస్తుంది

First published:

Tags: Air Pollution, WHO

ఉత్తమ కథలు