Sahara Desert: ఆ ఎడారుల్లో లక్షల చెట్లు.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

Sahara Desert: ఎడారి అనగానే ఇసుక దిబ్బలు, భరించలేని వేడి మనకు గుర్తొస్తాయి. కనుచూపు మేరలో ఎక్కడా చెట్లు కనిపించవు. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఓ రెండు ఎడారుల్లో చెట్లు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • Share this:
ఎడారి అనగానే ఇసుక దిబ్బలు, భరించలేని వేడి మనకు గుర్తొస్తాయి. కనుచూపు మేరలో ఎక్కడా చెట్లు కనిపించవు. ఉత్తర ఆఫ్రికాలోని సహారా, సహెల్ ఎడారులు కూడా ఇలాగే ఉంటాయి. కానీ ఈ ఎడారులపై చేసిన తాజా పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఈ రెండు ఎడారుల్లో చెట్లు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సాంకేతికతతో పాటు శాటిలైట్ ఇమేజెస్‌ సహకారం తీసుకున్నారు.

గతంలో గుర్తించలేదు
సహారా, సహెల్ ఎడారుల్లో 1.8 బిలియన్ చెట్లు ఉన్నాయని ప్రస్తుత అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో వీటి సంఖ్యను గుర్తించలేదని పరిశోధకులు అంటున్నారు. సహారా ఎడారిలో చాలా చెట్లు పెరుగుతున్నాయని తాము గుర్తించినట్లు అధ్యయన బృందానికి నాయకత్వం వహించిన మార్టిన్ బ్రాండ్జ్ చెబుతున్నారు. ఆయన కొపెన్‌హాగన్ యూనివర్సిటీలోని జాగ్రఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్. "ఇక్కడి ఎడారుల్లో చెట్లు లేని విస్తారమైన ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఇసుక దిబ్బల మధ్య కూడా చెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం" అని బ్రాండ్జ్ పేర్కొన్నారు.

డేటాతో ఎన్నో ప్రయోజనాలు
అడవుల నరికివేతపై స్పష్టమైన సమాచారం సేకరించేందుకు, ఆయా ప్రాంతాల్లో భూమిపై కార్బన్ నిల్వను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి అవసరమయ్యే డేటాను పరిశోధకులకు ఈ సర్వే అందించనుంది. అడవుల సంరక్షణ, పునరుద్ధరణ, వాతావరణ మార్పులపై అధ్యయనం వంటి వాటి కోసం ఇలాంటి డేటా ఉపయోగపడుతుందని పరిశోధనలో పాల్గొన్న జెస్సీ మేయర్ చెబుతున్నారు. ఆయన నాసాలోని Goddard Space Flight Centerలో ప్రోగ్రామర్ గా పనిచేస్తున్నారు. మరికొన్ని సంవత్సరాలలో ఇలాంటి అధ్యయనాలు మళ్లీ చేయవచ్చు. అడవుల నరికివేత నిర్మూలకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

చెట్ల లెక్కింపు సులువు కాదు
ఎడారుల్లో చెట్లు ఉన్న ప్రాంతాలను కనుక్కోవడం, వాటిని లెక్కించడం అంత తేలికైన పని కాదు. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను శాటిలైట్‌ ఇమేజ్‌లలో గుర్తించాలి. తక్కువ రిజల్యూషన్ ఉండే అలాంటి చిత్రాల్లో చెట్ల సంఖ్యను అంచనా వేయాలి. వాటి సాంద్రత ఎక్కువగా ఉంటే ప్రాంతాల శాటిలైట్ ఫొటోలు మరీ తక్కువ రిజల్యూషన్ తో ఉంటాయి. అలాంటి వాటిల్లో చెట్ల సంఖ్యను గుర్తించడం చాలా కష్టం. ఎక్కువ రిజల్యూషన్ ఉండే ఇమేజ్‌లలో కూడా సమస్యలు ఉన్నాయి. చెట్లు ఎక్కువగా విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ఒక్కో దాన్ని లెక్కించడం అసాధ్యం.

సాంకేతికతతో లెక్కించారు
ఈ సమస్యకు పరిష్కారంగా బ్రాండ్ట్, అతడి బృందం ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. చెట్ల సంఖ్యను తెలుసుకోవడానికి ఉపగ్రహ చిత్రాలను కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా విశ్లేషించారు. దీనిపై ఆ బృదం శిక్షణ తీసుకుంది. ఫలితంగా బ్రాండ్జ్‌ ఒక్కరే వ్యక్తిగతంగా 90,000 చెట్లను లెక్కించగలిగారు. కానీ ఇందుకు ఆయనకు ఒక సంవత్సరం సమయం పట్టింది. ఈ ప్రక్రియలో వివిధ ప్రాంతాల్లో, వివిధ రకాల చెట్లు ఎలా కనిపిస్తాయో తెలుసుకోవాలని ఆయన అంటున్నారు. శిక్షణ ద్వారా లక్షల మంది ఏళ్లపాటు చేసే చెట్ల లెక్కింపు ప్రక్రియను తక్కువ సమయంలోనే పూర్తి చేశామని వివరించారు.

సుదీర్ఘ ప్రక్రియ
చెట్ల లెక్కింపు, గుర్తింపునకు సంబంధించిన ఇతర అధ్యయనాలను ఎస్టిమేషన్స్‌ అండ్ ఎక్స్‌ట్రాపోలేషన్స్‌ ఆధారంగా చేశారు. కానీ తాజా సర్వేలో పరిశోధకులు ప్రతి చెట్టును ప్రత్యక్షంగా గుర్తించి, లెక్కించారు. ఈ సర్వేకు సంబంధించిన వివరాలను నేచర్ జర్నల్‌లో బుధవారం ప్రచురించారు. ఈ సర్వేలో 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు (సుమారు 5,00,000 చదరపు మైళ్లు) విస్తరించి ఉన్న భూభాగంలో 11,000 శాటిలైట్ ఇమేజ్లను విశ్లేషించారు.

మ్యాపింగ్ సాధ్యమే..
ఈ టెక్నిక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ చెట్టు లొకేషన్‌ను, దాని పరిమాణాన్ని మ్యాపింగ్ చేయడం సాధ్యమవుతుందని న్యూ మెక్సికో స్టేట్ యూనివర్సిటీలోని ప్లాంట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ విభాగానికి చెందిన నియాల్ పి. హనన్, జూలియస్ అంచాంగ్ చెబుతున్నారు. ఎడారుల్లోని వృక్షసంపదపై కచ్చితమైన సమాచారం ఆధారంగా ప్రపంచ స్థాయి పర్యావరణ శాస్త్రం, బయోజాగ్రఫీ, కార్బన్, నీరు, ఇతర పోషకాల బయో కెమికల్ సైకిల్ గురించి తెలుసుకోవడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Published by:Nikhil Kumar S
First published: