మరో కొత్త రోగం.. అంటువ్యాధులు పెరిగే ప్రమాదం..

మరో కొత్త రోగం.. అంటువ్యాధులు పెరిగే ప్రమాదం..

ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)

దీనికి సంబంధించి మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఒక కేసు జూలైలో కాగా, మిగతా నాలుగు ఆగస్టులో నమోదయ్యాయి.

 • Share this:
  కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో కొత్త రకాల వైరస్‌, బ్యాక్టీరియాలపై ఫోకస్ పెరిగింది. ఇలాంటి కొత్త వైరస్, బ్యాక్టీరియాలు భవిష్యత్తులో పుట్టుకొస్తాయా ? అనే దానిపై అధ్యయనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే మాంసం తినే బ్యాక్టీరయా వల్ల అంటువ్యాధులు కలిగే ప్రమాదంతో పాటు కరోనా వైరస్ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. మాంసం తినే బ్యాక్టీరియా వల్ల కొంతమంది వ్యక్తులకు అంటువ్యాధులు ప్రబలడంతో అమెరికాలోని కనెక్టికట్ ఆరోగ్య అధికారులు అక్కడి నివాసితులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా ఈ బ్యాక్టీరియా లాంగ్ ఐలాండ్ సౌండ్లో కనుగొనబడింది. ఈ అంటువ్యాధి సోకినవారికి ఇంటెన్సివ్ కేర్ అవసరం చాలా ఉంది.

  ఇది నెక్రోటైజింగ్ ఫాసిటిస్ లేదా మాంసం తినే బ్యాక్టీరియాకు కూడా కారణమవుతుంది. తాజాగా ఈ విషయాలను కనెక్టికట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ బహిరంగపరిచింది. ఆరోగ్య శాఖ రాష్ట్ర ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మాథ్యూ కార్టర్ మాంసం తినే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధుల గురించి చేసిన రీసెర్చ్‌లో పేర్కొన్నారు. లాంగ్ ఐలాండ్ సౌండ్లో లేదా సమీపంలోని ఉప్పు లేదా ఉప్పునీటిలో విబ్రియో బ్యాక్టీరియా ఉండవచ్చని అధ్యయనంలో తేలింది. విబ్రియో బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

  దీనికి సంబంధించి మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఒక కేసు జూలైలో కాగా, మిగతా నాలుగు ఆగస్టులో నమోదయ్యాయి. అన్ని కేసులు 49 మరియు 85 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిలోనే కనుగొన్నారు. కాగా 2010–19 మధ్య కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో కేసులు అధికంగా పెరిగే అవకాశాలున్నాయని పరిశోధనలో తేలింది. విబ్రియో బ్యాక్టీరియా వండని మాంసంలో ఎక్కువగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది.

  వండని మాంసం తినడం ద్వారా ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశాలెక్కువ అని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తేల్చి చెప్పింది. విబ్రియో బ్యాక్టీరియా ప్రాణాంతక అనారోగ్యాలను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బహిరంగ గాయాలు విబ్రియో బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి. పచ్చబొట్లు, కుట్లు లేదా శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు, గాయాల పాలైన ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది.
  Published by:Kishore Akkaladevi
  First published: