చిలుక ముక్కు.. రెండు వేళ్లు.. గోబి ఎడారిలో వింతైన డైనోసార్ జాతులు

భూమిపై డైనోసార్ల వంటి రాక్షస బల్లులు అంతరించిపోయినా ఎక్కడోచోట వాటి అవశేషాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో డైనోసర్ల ఎముకలు, గోళ్లు, దంతాలు, గుడ్డు అవశేషాలు బయటపడటాన్ని మనం చూశాం. అయితే, తాజాగా అటువంటి అరుదైన అవశేషాలే మరోసారి బయటపడ్డాయి.

news18
Updated: October 8, 2020, 5:43 PM IST
చిలుక ముక్కు.. రెండు వేళ్లు.. గోబి ఎడారిలో వింతైన డైనోసార్ జాతులు
file image
  • News18
  • Last Updated: October 8, 2020, 5:43 PM IST
  • Share this:
మంగోలియాలోని ప్రసిద్ది గాంచిన గోబీ ఎడారిలో దంతాలు లేని రెండు డైనోసార్లను కనుగొన్నారు పరిశోధకులు. ఈ డైనోసర్లకి వేళ్లు, దంతాలు ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించి గోబీ ఎడారిలో డైనోసర్లకు చెందిన అనేక అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇక్కడ వెలుగుచూసిన డైనోసర్ జాతికి ‘ఒక్సోకో అవర్సన్’ అని నామకరణం చేశారు. ఇవి సుమారుగా 68 మిలియన్ (60.8 లక్షల) సంవత్సరాల క్రితం భూమిపై నివసించి ఉంటాయిని పరిశోధనల్లో తేలింది.

ఈ డైనోసర్లకు ఉండే ఈకలు రెండు మీటర్ల పొడవు వరకు పెరుగుతాయని పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న చిలుకల వలే దంతాలు లేని ముక్కును ఈ డైనోసర్లు కలిగి ఉన్నాయని చెబుతున్నారు. మంగోళియా గోబీ ఎడారిలో కనుగొన్న ఈ డైనోసర్ అవశేషాలపై పరిశోధన చేసిన బృందానికి యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ పరిధిలోని స్కూల్ ఆఫ్ జియోసైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ గ్రెగొరీ ఫన్స్టన్ నాయకత్వం వహించారు. ఈ డైనోసర్ల అస్థిపంజరాలపై కేంబ్రిడ్జిన్యూస్.యుకే ఇదివరకే పలు వార్తలను ప్రచురించిదని ఆయన పేర్కొన్నారు.

ఈ డైనోసర్లు పరిణామం చెందడానికి వాటి ఫోర్లింబ్స్, చేతులు ముఖ్యపాత్ర వహించాయని ఆయన అన్నారు. భూమిపై ఉన్న అన్ని డైనోసార్లను అంతరించిపోయే క్రమంలో ఈ డైనోసర్ జాతులు చాలా వైవిధ్యంగా కన్పించాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటివరకు బయటపడ్డ డైనోసర్ అవశేషాలతో పోలిస్తే వీటి అవశేషాలు వైవిధ్యంగా ఉన్నాయి. ఇటువంటివి చాలా అరుదుగా కన్పిస్తాయని చెప్పవచ్చు. పాంగేయా విభజన తరువాతి దశలలో ఉన్న సమయంలో ఈ డైనోసర్ల అవశేషాలు బయటపడటం తమ పరిశోధనకు ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం డైనోసార్ జాతులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడంతో ప్రస్తుతం ఈ జాతుల అవశేషాలు ఉత్తర అమెరికా మరియు గోబీ ఎడారిలో బయటపడుతున్నాయి.

ప్రస్తుతం మనం చూస్తున్న పక్షులు డైనోసర్ల నుండే ఆవిర్భవించాయని, ఈ రెండూ ఒకే జాతికి చెందినవని చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ పరిశోధనల ద్వారా ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published by: Srinivas Munigala
First published: October 8, 2020, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading