Biggest Dinosaur: మరో కొత్త డైనోసర్ జాతి.. దీని ఎత్తు, పొడవు ఎంతో తెలిస్తే షాకవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ఆస్ట్రేలియాలో మరో కొత్త డైనోసర్ జాతి బయటపడింది. వాటి నడుము వద్ద 5 నుంచి 6.5 అడుగుల ఎత్తు, 25 నుంచి 30 మీటర్ల వరకు పొడవు ఉంటాని శాస్త్రవేత్తలు (Paleontologists) అంచనా వేశారు.

  • Share this:
భూమి ఆవిర్భావం తరువాత జీవించిన జీవరాశిలో డైనోసర్లు (Dinosaur) ప్రధానమైనవి. వేల ఏళ్ల క్రితమే అంతరించిన ఈ రాకాసి బల్లులు.. జీవరాశి మనుగడకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. వీటి అవశేషాలు ఇప్పటికీ ప్రపంచమంతటా బయట పడుతున్నాయి. సినిమాలో చూడడం తప్ప.. ప్రస్తుతం ఈ భూమిపై ఉన్న వారెవరూ వీటిని చూసింది లేదు. కానీ శిలాజాల రూపంలో డైనోసార్ జాతులు బయటపడుతున్నాయి. బతాజాగా ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలు కొత్త డైనోసర్ జాతి అవశేషాలను కనుగొన్నారు. వీటిని ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసర్ల జాతుల్లో ఒకటిగా గుర్తించారు. రైతులు ఈ డైనోసర్ల ఎముకలను కనుగొన్న దశాబ్దం తర్వాత శాస్త్రవేత్తలు వీటి మనుగడ గురించి స్పష్టత ఇచ్చారు. మొక్కలను తిని జీవించిన ఈ డైనోసర్లు దాదాపు 92 నుంచి 96 మిలియన్ (960 లక్షల ఏళ్లు) సంవత్సరాల క్రితం క్రెటేషియస్ కాలంలో జీవించి ఉండేవని నిర్ధారించారు.

తల పొడవుగా ఉండే ఈ రాకాసి బల్లులు ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఒకటిగా ఉన్న కాలంలో నేలపై సంచరించాయి. నడుము వద్ద 5 నుంచి 6.5 అడుగుల ఎత్తు, 25 నుంచి 30 మీటర్ల వరకు పొడవు ఉంటాని శాస్త్రవేత్తలు (Paleontologists) అంచనా వేశారు. దాదాపు బాస్కెట్ బాల్ కోర్టంత ఉండే ఈ డైనోసర్లు, రెండంతస్తుల భవనమంత ఎత్తు ఉంటాయని పేర్కొన్నారు.

ఈ కొత్త జాతులను ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద డైనోసర్లుగా గుర్తించారు. ప్రపంచంలో టాప్-5 స్థానాల్లో ఒకటిగా ఇవి నిలుస్తున్నాయి. గతంలో దక్షిణ అమెరికాలో కనుగొన్న టిటానోసార్స్ అనే జాతుల జాబితాలో కూడా ఇవి చేరాయి. మంచుయుగంలో ఆవిర్భవించిన జీవరాశిలో ఇవి చిన్న శాంపిలే అని క్వీన్స్ లాండ్ మ్యూజియం క్యూరేటర్ స్కాట్ హక్నుల్ అన్నారు. శాస్త్రవేత్తలు ఈ నూతన డైనోసర్ల జాతికి "ఆస్ట్రోలోటిటన్ కూపరెన్సిస్" అని పేరు పెట్టారు. 2006లో క్వీన్స్ లాండ్ లో సౌథర్న్ టైటాన్ అనే పేరు కలిగిన డైనోసర్ల జాతిని ముందుగా కనుగొన్నారు. 17 నూతన జాతుల అన్వేషణలో 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఇదో మైలురాయిగా వారు అభిప్రాయపడుతున్నారు.

3డీ డిజిటల్ టెక్నాలజీతో స్కాన్ చేసి..
డైనోసర్ల ఎముకలు చాలా భారీగా, పెళుసుగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియాల్లో వీటిని ఉంచుతారు. ఈ కారణంగా శాస్త్రీయ అధ్యయనం కష్టమవుతుంది. ఎరోమంగా నేచురల్ హిస్టరీ మ్యూజియం, క్వీన్స్ లాండ్ మ్యూజియం నుంచి వచ్చిన బృందం మొదటిసారిగా డిజిటల్ టెక్నాలజీ ద్వారా 3డీ స్కాన్ చేసి ఎముకలను పోల్చి చూసింది. ఆస్ట్రోలోటిటన్ వేరే జాతి అని నిర్ధారించడానికి తాము వాటి ఎముకలను క్వీన్స్ లాండ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర డైనోసర్ల ఎముకల జాతులతో పోల్చాల్సిన అవసరముందని స్కాట్ తెలిపారు. మొక్కలు తినే ఈ డైనోసర్లను భారీ థెరపోడ్లు వేటాడతాయని, వీటి ఆధారంగా కొత్త డైనోసర్ల నమూనాలను కనుగొనడానికి ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు.
Published by:Shiva Kumar Addula
First published: