కరోనా వైరస్ మహమ్మారి రెండేళ్ల తర్వాత కూడా కొత్త రూపాల్లో దూసుకొస్తూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. సెకండ్ వేవ్ లో లక్షల మందిని బలితీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ప్రమాదగారిగా పరిణమించిన ఒమిక్రాన్ అమెరికా, యూరప్ దేశాల్లో సునామీ తరహాలో విస్తరిస్తూ ఆసియా దేశాల్లోనూ లాక్ డౌన్లకు కారణమైంది. అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ కంటే ఎక్కువ మ్యూటేషన్లు కలిగిన, దాని కంటే వేగంగా వ్యాప్తి చెందుతోన్న కొత్త వేరియంట్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. IHU Variant (ఇహూ వేరియంట్) అని పిస్తోన్న ఈ రకానికి సంబంధించిన కేసులను ఫ్రాన్స్ లో గుర్తించారు..
ఒమిక్రాన్ తీవ్రత అధికంగా ఉన్న యూరప్ లోనే కొత్త రకం వేరియంట్ బయటపడటం గమనార్హం. ఫ్రాన్స్ లోని అంటువ్యాదుల పరిశోధన కేంద్రం నిపుణులు దీనిని గుర్తించారు. ఈ వేరియంట్ ను IHU (b.1.640.2)రకంగా పేర్కొన్నా సైంటిస్టులు.. ఇందులో కరోనా వైరస్ దాదాపు 46 మ్యూటేషన్లు జరిగినట్లు గుర్తించామన్నారు. కొత్త వేరియంట్ కు సంబంధించి ఫ్రాన్స్ లోని మార్సిల్లెస్ నగరంలో ఇప్పటికే 12 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఆఫ్రికా దేశమైన కామెరూన్ నుంచి ఫ్రాన్స్ వచ్చిన ప్రయాణికుల్లోనే ఈ వేరియంట్ బయటపడిందని అధికారులు భావిస్తున్నారు. వ్యాక్సిన్లపై కొత్త వేరియంట్ ఇహూ ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని ఫ్రాన్స్ కొవిడ్ నిపుణులు పేర్కొన్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఇహూ గురించి ఫ్రెంచ్ సైంటిస్టులు చెప్పిన విషయాలను అమెరికాకు చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్, హెల్త్ ఎకనామిస్ట్ ఎరిక్ డింగ్ వెల్లడించారు. కాగా, భవిష్యత్తులోనూ ఇలాంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుంటాయని, అన్నీ ప్రమాదకరం కానప్పటికీ, ఇమ్యూనిటీని తప్పించుకునే సామర్థ్యం ఉంటేనే ఒమిక్రాన్ మాదిరిగా ఆందోళనకర వేరియంట్ గా పరిగణిస్తారని ఎరిక్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, France, Omicron