British Currency: బ్రిటన్ కొత్త కరెన్సీ నోటుపై ఉన్న ఫొటో ఎవరిదో తెలుసా? ఆసక్తికర విషయాలు

బ్రిటన్ 50 పౌండ్ల నోట్

బ్రిటన్​లో హోమో సెక్స్​ చట్టవిరుద్దమైన సమయంలో ట్యూరింగ్ స్వలింగ సంపర్కం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 1952లో అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు జైలు శిక్ష అనుభవించాడు.

  • Share this:
దేశానికి విశిష్ట సేవలు చేసిన, జాతి గర్వించదగ్గ కీర్తి గడించిన వారి చిత్రాలను కరెన్సీ నోట్లు, కాయిన్స్​పై ముద్రిస్తుంటారు. మన దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఎలాగైతే ఉంటుందో.. ఇతర దేశాల కరెన్సీపై కూడా వారి దేశానికి చెందిన ప్రముఖ వ్యక్తుల చిత్రాలను ముద్రిస్తారు. ఇదే తరహాలో బ్రిటన్​ ప్రభుత్వం కొత్తగా 50 పౌండ్లు (70 డాలర్లు) నోట్లను విడుదల చేసింది. ఈ నోట్లపై ప్రముఖ గణిత శాస్త్రవేత్త, కంప్యూటర్ నిపుణుడు అలాన్ ట్యూరింగ్ ఫోటోను ముద్రించారు. ఆయన చిత్రాలతో కూడిన కరెన్సీ నోట్లు బ్రిటన్​లో తాజాగా చెలామణిలోకి వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో అప్పటి సైనికుల కోడెడ్ సందేశాలను డీక్రిప్ట్ చేసే మెషిన్స్​ను కనిపెట్టిన ట్యూరింగ్​.. అత్యంత ప్రాచుర్యం పొందిన కంప్యూటర్​ శాస్త్రవేత్తగా ప్రసిద్ది చెందారు. అతడి ఆవిష్కరణలు ఆధునిక కంప్యూటర్ సైన్స్​కు సైద్ధాంతిక పునాది వేసింది.

రెండో ప్రపంచ యుద్ద సమయంలో కంప్యూటర్​ శాస్త్రవేత్తగా ఎన్నో సేవలందించిన అలాన్ ట్యూరింగ్.. ఆ తరువాత జీవశాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. ఈ కొత్త నోట్లపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ మాట్లాడుతూ ‘‘ఈ కొత్త నోటుపై ట్యూరింగ్​ చిత్రాన్ని ముద్రించడం గర్వకారణం. తన ఆవిష్కరణలతో బ్రిటీష్​ సమాజానికి ఎంతో కృషి చేశారు. ఆయన కృషిని రాబోయే తరాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందువల్లే, ట్యూరింగ్​ గౌరవార్థం తన చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాం’’ అని అన్నారు.

* 50 పౌండ్ల నోట్లపై​ ట్యూరింగ్ చిత్రం..
కాగా, బ్రిటన్​లో హోమో సెక్స్​ చట్టవిరుద్దమైన సమయంలో ట్యూరింగ్ స్వలింగ సంపర్కం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 1952లో అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు జైలు శిక్ష అనుభవించాడు. అదే సమయంలో ఆయనపై సైనైడ్ విష ప్రయోగం జరగడంతో మరణించాడు. అయితే, దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి హంతకులు తప్పించుకున్నారు. కాగా, ట్యూరింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ GCHQ గూఢాచారి ఏజెన్సీలో పనిచేశాడు. ఆయన, గౌరవార్థం కరెన్సీ నోట్లతో పాటు ఒక కళాకృతిని ఆవిష్కరించారు. కొత్త 50 పౌండ్ల నోట్లు మరింత మన్నికైన పాలిమర్ లేదా ప్లాస్టిక్‌తో తయారవుతాయి. ప్రస్తుతం, మార్కెట్​లో ఉన్న 50 పౌండ్ల నోట్లు 2020 సెప్టెంబర్​ వరకు మాత్రమే చలామణిలో ఉంటాయి. బ్రిటన్​లో 4.5 బిలియన్లకు పైగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నోట్లలో 357 మిలియన్ల యాభై పౌండ్ల నోట్లు చెలామణిలో ఉన్నాయి.
Published by:Shiva Kumar Addula
First published: