Video : వామ్మో... కంచె దూకిన మొసలి... ఇట్టాగైతే ఎట్టా...?

జనరల్‌గా జూల్లో మొసళ్ల చుట్టూ గోడ లేదా కంచె లాంటిది కడుతుంటారు. ఎందుకంటే... మొసళ్లు నీటి లోంచి బయటకు వచ్చాక.. అలా పడివుంటాయనీ గోడ దాటి, కంచె దూకి రావని అధికారుల నమ్మకం. ఈ వీడియో చూస్తే మాత్రం... వాళ్లు కంచెలు తీసేసి... గోడలు నిర్మించడం గ్యారెంటీ.

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 2:54 PM IST
Video : వామ్మో... కంచె దూకిన మొసలి... ఇట్టాగైతే ఎట్టా...?
కంచె దూకిన మొసలి (Image : YT - Leftoverpizza 445)
Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 2:54 PM IST
ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ... మళ్లీ చూస్తున్నారు. ఎందుకంటే... అదో నమ్మశక్యం కాని ఫీట్. చూస్తుండగానే... ఆ మొసలి... గబగబా కంచె ఎక్కేసి... అటువైపు దూకేసి... చకచకా నడుస్తూ వెళ్లిపోయింది. అంతా 11 సెకండ్లలో జరిగిపోయింది. ఫ్లోరిడా... జాక్సన్‌విల్లేలోని... నావల్ ఎయిర్ స్టేషన్‌లో జరిగిందీ ఘటన. ఆ మొసలి ఆ సాహసం చెయ్యడానికి కారణం... అటువైపు రెసిడెన్షియల్ ఏరియా ఉంది. అక్కడ దానికి మనుషుల రూపంలో కావాల్సినంత ఆహారం దొరుకుతుంది. అందుకే ఆ తెలివైన మొసలి... అంతపని చేసిందంటున్నారు అధికారులు. ఆ వీడియో తీసిన క్రిస్టినా స్టీవార్ట్‌ని పోలీసులు మెచ్చుకున్నారు. ఎందుకంటే... ఆమె వీడియో తియ్యకపోయి ఉంటే... ఓ అరుదైన దృశ్యం మిస్ అవ్వడమే కాదు... ఆ మొసలి కంచె దూకి వచ్చిందంటే ఎవరూ నమ్మరు కూడా. కానీ... ఆధారాలతో వీడియో ఉండటంతో... పోలీసులు, వన్యప్రాణి సంరక్షణ అధికారులు... ఆలోచనలో పడ్డారు. ఇకపై మొసళ్లను ఆపేందుకు ఫెన్స్ ఉండే సరిపోదనీ, గోడలాంటిది ఉండాల్సిందేనని వాళ్లకు అర్థమైంది.



ఇందుకు సంబంధించి నావల్ ఎయిర్ స్టేషన్ కూడా తన ఫేస్‌బుక్ పేజీలో మొసలి కంచె ఎక్కుతున్న ఫొటోను పెట్టింది. మా భద్రతా చర్యల్ని అవి లెక్కలోకి తీసుకోవట్లేదనీ ఫన్నీ కామెంట్ రాసింది. మొసళ్ల దగ్గరకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది.





ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోని చూసిన కొంతమంది అమ్మో అని భయపడుతుంటే... మరికొందరు... అమ్మో... అలా ఎలా ఎక్కగలిగింది అని ఆశ్చర్యపోతున్నారు. పరిశోధకులు మాత్రం... మొసళ్లకు అలా పైకి ఎగబాకడం కూడా వచ్చని చెబుతున్నారు. అందువల్ల ఆ వీడియో ఫేక్ అని మనం అనుకోవాల్సిన పనిలేదు.





First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...