Trump vs Monkey : ట్రంప్‌ని ఆ కోతితో పోల్చుతున్న నెటిజన్లు

Donald Trump : అమెరికా అధ్యక్షుల్లో అత్యంత ఎక్కువ విమర్శలు ఎదురకొంటున్న వారిలో ట్రంప్ ఒకరు. ఆయన అధ్యక్షుడు అయినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయనపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు నెటిజన్లు. తాజాగా... ఆయన్ని మరోసారి కోతితో పోల్చుతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 24, 2019, 11:16 AM IST
Trump vs Monkey : ట్రంప్‌ని ఆ కోతితో పోల్చుతున్న నెటిజన్లు
డొనాల్డ్ ట్రంప్, ఇండొనేసియా కోతి (Credit - Twitter - Nelson Tang)
  • Share this:
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేస్, హావభావాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా దుమారం రేగింది. నెటిజన్లలో చాలా మంది ఎవరికి తోచినట్లు వారు గ్రాఫిక్స్ చేసి మరీ ట్రంప్‌పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది రకరకాల జంతువుల్ని ట్రంప్‌నీ పోల్చి వీడియోలు పెట్టారు. ఐతే... వీటిలో ట్రంప్ వర్సెస్ మంకీ అన్నది నెటిజన్లు ఎక్కువగా స్పందిస్తున్న అంశం. తాజాగా హౌడీ మోదీ సభ జరిగిన సందర్భంగా... ప్రధాని మోదీని మెచ్చుకుంటున్నారు గానీ... ట్రంప్‌పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మోడీ కోతి లాగా ఉన్నారని ఇదివరకు ఎంతో మంది రకరకాల కోతుల ఫేస్‌లను పోస్ట్ చేశారు. తాజాగా మరో నెటిజన్ కూడా... ఓ భారీ మంకీని చూపిస్తూ... "నేను ట్రంప్ లా ఉన్నానా" అని అది ప్రశ్నిస్తున్నట్లు కామెంట్ పెట్టారు.


అది ఏ జాతి కోతి? : ఈ పోస్ట్ ఆసక్తిగా ఉండటంతో... పై ఫొటోలో కోతి పేరేంటి? అది ఎలాంటి జాతి? ఎక్కడ ఉంటుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు నెటిజన్లు. నిజానికి అది ప్రోబోస్సిస్ మంకీ (The proboscis monkey/Nasalis larvatus). మన భాషలో పొడవు ముక్కు కోతి అంటారు. ఇండొనేసియాకి చెందిన ఈ కోతిని అక్కడ బెకాటన్ అని పిలుస్తారు.


ఎక్కువగా ఈ కోతులు ఆగ్నేయ ఆసియా దీవి... బోర్నియాలో కనిపిస్తాయి. ఇదే బోర్నియాలో ఒరంగుటాన్‌లు కూడా ఉంటాయి. చిత్రమేంటంటే... ఆ పొడవు ముక్కులతోనే మగ బెకాటన్ కోతులు... ఆడ బెకాటన్ కోతుల్ని ఆకర్షిస్తాయట. ఆ ముక్కులు కూడా మగవాటికే పెద్దగా ఉంటాయి. ఒక్కో మగ కోతీ... దాదాపు 2 నుంచీ 7 ఆడ కోతులకు యజమానిలా వ్యవహరిస్తాయట.

పొడుగు ముక్కు కోతి


ఈ పొడవు ముక్కు కోతులు... ఎక్కువగా అడవుల్లోనే ఉంటాయి. నదులు, తీర ప్రాంతాలు, మాంగ్రూవ్ చెట్లు, తుప్పల్లోనే ఆహారాన్ని వెతుక్కుంటాయి. మాగ్జిమం నేలపైకి రావు. గుంపులుగా తిరుగుతాయి. ప్రపంచంలోని మరే కోతి జాతికీ రానంత గొప్పగా ఇవి ఈత కొట్టగలవు. ప్రస్తుతం ఈ కోతులు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి.

ట్రంప్‌పై ఇదివరకు వచ్చిన సెటైరికల్ మంకీ పోస్టులు :

ఇవి కూడా చదవండి :

ఐరాసలో షాక్... సడెన్ ఎంట్రీ ఇచ్చిన ట్రంప్... ఇదీ కారణం

Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : డయాబెటిస్ ఉందా... మీరు తినదగ్గ 10 బేక్‌ఫాస్ట్స్ తెలుసుకోండి


Peanut Butter Fruit : ఈ ఫ్రూట్ విశేషాలు తెలుసా మీకు?
First published: September 24, 2019, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading