భారత్‌కు నేపాల్ షాక్... పెద్ద నోట్లు రద్దు

భారత్‌కు నేపాల్ షాక్... పెద్ద నోట్లు రద్దు

ప్రతీకాత్మక చిత్రం

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూ. 2 వేలు, రూ. 500, రూ. 200 నోట్లపై నేపాల్ సర్కార్ నిషేధం విధించింది. నోట్ల రద్దు అనంతరం, భారత్ ప్రవేశపెట్టిన కొత్త నోట్ల నేపాల్‌లో చెల్లుబాటు కావని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

 • Share this:
  నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూ. 2 వేలు, రూ. 500, రూ. 200 నోట్లపై నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి డిసెంబర్ 10న నేపాల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే 13న నేపాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రి గోకుల్ ప్రసాద్ ఈ సమాచారాన్ని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. నేపాల్‌కు చెందిన ఓ ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం నేపాల్‌లో భారత్‌కు చెందిన రూ. 100 రూపాయల నోట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వంద రూపాయల మారకానికి మించిన నోట్లను ప్రజలు తమ వద్ద ఉంచుకోవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. నోట్ల రద్దు అనంతరం, భారత్ ప్రవేశపెట్టిన కొత్త నోట్ల నేపాల్‌లో చెల్లుబాటు కాదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

  వెబ్ సైట్ కథనం ప్రకారం పెద్ద నోట్ల రద్దు తరువాత లక్షల సంఖ్యలో భారత్‌కు చెందిన పాత నోట్లు నేపాల్‌లో చిక్కుకుపోయాయి. మరో న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ దగ్గర భారత్‌కు రూ. 8 కోట్లు విలువ చేసే పాత నోట్లు ఉన్నాయి. నేపాల్ వ్యాపారాల్లో భారత్ కరెన్సీ ఎప్పటి నుంచో చలామణీలో ఉంది. పెద్ద నోట్ల రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత భారత ప్రజల తరహాలోనే నేపాల్ ప్రజలు కూడా ఇబ్బందిపడ్డారు.

  ఇవి కూడా చదవండి

  తమ దగ్గర ఉన్న పాత కరెన్సీని మార్చి ఇవ్వాలని నేపాల్ ప్రభుత్వం అనేకసార్లు భారత ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఇందుకు కేంద్రం స్పందించలేదు. భారత ప్రభుత్వం నుంచి తన వినతికి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లే నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే భారత్‌కు చెందిన వంద నోటు విషయంలో మాత్రం నేపాల్ ఇందుకు మినహాయించింది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు