నేపాల్ పార్లమెంటులో భారత్ వ్యతిరేక నినాదాలు...కొత్త మ్యాప్‌ను ఆమోదించిన ఎగువ సభ...

వివాదాస్పద కాలాపానీ ప్రాంతాన్ని తమ భూభాగంగా చూపించే 'వివాదాస్పద మ్యాప్'కు సంబంధించిన రాజ్యాంగ సవరణను నేపాల్ పార్లమెంటు ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటు పడక పోవడం గమనార్హం. ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, కొంతమంది ఎంపీలు 'భారత్ వ్యతిరేక' నినాదాలు వినిపించారు.

news18-telugu
Updated: June 15, 2020, 2:19 PM IST
నేపాల్ పార్లమెంటులో భారత్ వ్యతిరేక నినాదాలు...కొత్త మ్యాప్‌ను ఆమోదించిన ఎగువ సభ...
నేపాల్ కొత్త మ్యాప్‌కు ఎగువ సభ ఆమోదం (Image;ANI)
  • Share this:
భారత-నేపాల్ సరిహద్దు వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. వివాదాస్పద కాలాపానీ ప్రాంతాన్ని తమ భూభాగంగా చూపించే 'వివాదాస్పద మ్యాప్'కు సంబంధించిన రాజ్యాంగ సవరణను నేపాల్ పార్లమెంటు ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఒక్క ఓటు పడక పోవడం గమనార్హం. ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, కొంతమంది ఎంపీలు 'భారత్ వ్యతిరేక' నినాదాలు వినిపించారు. అంతకుముందు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును దిగువ సభలో అధిక మెజారిటీతో ఆమోదించారు. ఈ కొత్త పటంలో, భారతదేశంలోని కాలాపాని, లిపులేఖ్, లింపుధర ప్రాంతాలు నేపాల్‌ తమవని చూపుతూ కొత్త పటం జారీ చేసింది. .

అయితే ఆదివారం, నేపాల్ పార్లమెంటులో కొత్త మ్యాపును సమర్పించిన సమయంలో, కొంతమంది ఎంపీలు చప్పట్లు కొట్టి స్వాగతించారు. ఇవే కాకుండా, ఈ మూడు ప్రాంతాలను భారతదేశం నుండి ఉపసంహరించుకోవటానికి సంబంధించిన నినాదాలను కూడా చాలా మంది ఎంపీలు లేవనెత్తారు. అయితే, దీనిపై చర్చ సందర్భంగా, సంభాషణల ద్వారా ఈ మొత్తం విషయానికి పరిష్కారం కనుగొనాలని చాలా మంది ఎంపీలు అంగీకరించారు. ఈ బిల్లుపై శనివారం దిగువ సభలో ఓటింగ్ జరిగింది, ఇందులో మొత్తం 275 మందిలో 258 మంది ఎంపీలు తమకు అనుకూలంగా ఓటు వేశారు. ఎగువ సభలో, 59 మంది ఎంపీలలో 50 మంది ఆదివారం హాజరయ్యారు. అందరూ అనుకూలంగా ఏకగ్రీవంగా ఓటు వేశారు.

అయితే నేపాల్ చర్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ - నేపాల్ ప్రతినిధుల సభ తమ దేశంలోని కొన్ని భారతీయ భూభాగాలను చూపించే విధంగా మ్యాప్‌ను మార్చడానికి సవరణ బిల్లును ఆమోదించినట్లు మేము గమనించాము. అయితే, ఈ విషయంలో ఇప్పటికే తమ నిర్ణయం స్పష్టం చేసాము. చారిత్రక వాస్తవాలు, సాక్ష్యాల ఆధారంగా కాదు. ఈ సందర్భంలో, వారి దావా చెల్లదని, ఇది సరిహద్దు వివాదంపై ప్రస్తుత ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు.

భారత్ లిపులేఖ్ నుంచి ధార్చులా వరకు ఒక రహదారిని నిర్మిస్తోంది. దీనిపై నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మే 8 న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు. దీని తరువాత మాత్రమే నేపాల్ ప్రభుత్వం నిరసన తెలుపుతూ మే 18 న కొత్త పటాన్ని విడుదల చేసింది. ఈ కొత్త పటంపై భారత్ అభ్యంతరం చెప్పడమే కాక, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కూడా పరిగణించింది.
First published: June 15, 2020, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading