Home /News /international /

NEPAL CRISIS KHATMANDU BANS IMPORTS OF LUXURY GOODS AMID DWINDLING FOREX RESERVES SK

ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం.. ఫారిన్ లిక్కర్, విదేశీ టీవీలు సహా ఇవన్నీ బంద్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nepal: ప్రస్తుతం నేపాల్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు (Nepal Foreign Reserves) మరో 6 నెలల రెండు వారాలకు మాత్రమే సరిపోతాయి. ఈ క్రమంలోనే నిత్యావసరం కాని వస్తువుల దిగుమతిపై నిషేధం విధిస్తోంది.

    నేపాల్‌లో ఆర్థిక సంక్షోభం (Nepal Crisis) ముంచుకొస్తోంది. అప్పులు పెరిగిపోవడం,  విదేశీ మారక నిల్వలు తగ్గడంతో.. పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వ దిగుమతులపై నిషేధం విధిస్తోంది. ఇప్పటికే పలు విలాసవంతమైన వస్తువులను బ్యాన్ చేయగా..తాజా మరికొన్నింటిపై నిషేధం విధించింది. రెడీమేడ్ లిక్కర్, రెడీమేడ్ సిగరెట్స్, పొగాకు ఉత్పత్తులు, కుర్‌కురే, లేస్ వంటి స్నాక్స్, డైమండ్స్, 600 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన సెల్‌ఫోన్లు, 32 ఇంచుల పైబడిన టీవీలు, జీపులు, కార్లు, వ్యాన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, 250 సీసీ కన్నా అధిక సామర్థ్యం కలిగిన బైకులు, ఆట వస్తువులు, ప్లేయింగ్ కార్డులపై నిషేధం విధించింది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. జూలై రెండో వారం వరకు అమల్లో ఉంటుంది.

    Aung San Suu Kyi: అవినీతి కేసులో ఆంగ్‌ సాన్‌ సూకీకి జైలు శిక్ష.. సైనిక సర్కారు ప్రతీకారం?

    పర్యాటక ఆదాయం (Nepal Tourism) తగ్గడం, ప్రవాస నేపాలీలు సొంత దేశానికి పంపించే డబ్బు తగ్గడంతో నేపాల్ ప్రభుత్వ రుణాలు భారీగా పెరిగాయి. నేపాల్ అప్పులు ఆ దేశ జీడీపీలో 43 శాతాన్ని దాటిపోయాయి. మరోవైపు విదేశీ మారక నిల్వలు తరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశం వద్ద 10 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలు మాత్రమే ఉన్నాయి. నేపాల్ సెంట్రల్ బ్యాంక్, నేపాల్ జాతీయ బ్యాంక్ లెక్కల ప్రకారం 2021 జులై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య వరకు విదేశీ కరెన్సీ నిల్వల్లో తగ్గుదల 16 శాతానికిపైగా నమోదైంది. ప్రవాస నేపాలీలు సొంత దేశానికి పంపించే డబ్బులో 5 శాతం తగ్గుదల నమోదైంది. నేపాల్ దిగుమతుల్లో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తులే ఉన్నాయి. గత ఏడాది జులై నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1.54 బిలియన్ డాలర్ల పెట్రోలియం ఉత్పతులను ఆదేశం దిగుమతి చేసుకుంది.

    Karachi suicide bomber: అందమైన జీవితం.. ఇద్దరు పిల్లలు, ఎంఫిల్ లో పట్టా పొందింది.. కానీ..

    ప్రస్తుతం నేపాల్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు (Nepal Foreign Reserves) మరో 6 నెలల రెండు వారాలకు మాత్రమే సరిపోతాయి. ఈ క్రమంలోనే నిత్యావసరం కాని వస్తువుల దిగుమతిపై నిషేధం విధిస్తోంది. కార్లు, కాస్మొటిక్స్, బంగారం, టీవీలు, లిక్కర్, సెల్‌ఫోన్లు వంటివన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు విలాసవంతమైన వస్తువలను దిగుమతి చేసుకునేందుకు నేపాలీ వ్యాపారస్తులకు క్రెడిట్ లెటర్‌ను ఇవ్వకూడదని అన్ని బ్యాంకులను నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది.

    Ukraine-Russia: రష్యాకు టార్గెట్స్‌గా మారిన ఉక్రెయిన్‌ రైలు మార్గాలు.. ఎందుకు ఇవి కీలకంగా

    విదేశీ మారక నిల్వలు భారీగా పడిపోతున్న నేపథ్యంలో ఇటీవల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ మహా ప్రసాద్‌ను తొలగించారు. నేపాల్ చరిత్రలో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ను తొలగించడం ఇది రెండోసారి. ఐతే ఆయన్ను తొలగించడానికి స్పష్టమైన కారణాలను మాత్రం చెప్పలేదు. నేపాల్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో.. శ్రీలంకకు పట్టిన గతే.. నేపాల్‌కు పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆర్థిక సంక్షోభం తప్పదని అంచనాలు ఉన్నాయి. ఐతే తమ ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడంపై నేపాల్ ఆర్థిక మంత్రి జనార్ధన్ శర్మ తప్పుబట్టిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితిని సూచించే సూచీలు సాధారణంగానే ఉన్నాయని.. తమ దేశాన్ని శ్రీలంకతో పోల్చడం ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో పోల్చితే నేపాల్ అప్పులు తక్కువగానే ఉన్నాయని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International, International news, Nepal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు