నేపాల్‌ బ్యాంక్‌లో భారత్ ‘రద్దు చేసిన నోట్లు’... ఎంతంటే...

నేపాల్‌లో కూడా భారత కరెన్సీ చాలా కాలంగా చెలామణిలో ఉంది. ప్రత్యేకించి ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో భారత కరెన్సీ చెలామణి ఎక్కువగా ఉంటుంది.

news18-telugu
Updated: January 26, 2020, 7:18 PM IST
నేపాల్‌ బ్యాంక్‌లో భారత్ ‘రద్దు చేసిన నోట్లు’... ఎంతంటే...
నేపాల్‌లో కూడా భారత కరెన్సీ చాలా కాలంగా చెలామణిలో ఉంది. ప్రత్యేకించి ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో భారత కరెన్సీ చెలామణి ఎక్కువగా ఉంటుంది.
  • Share this:
భారత ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ.1000 నోట్ల నేపాల్‌లో పోగుబడ్డాయి. నేపాల్ సెంట్రల్ బ్యాంక్‌లో సుమారు రూ.7కోట్ల విలువైన భారత రద్దయిన కరెన్సీ ఉంది. దీంతో ఆ డబ్బును తీసుకుని తమకు డబ్బులు ఇవ్వాలంటూ నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావాలీ తెలిపారు. అయితే, పాత నోట్లను తీసుకునే గడువు ఎప్పుడో ముగిసిపోవడంతో ఈ వినతిపై భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు.

నేపాల్‌లో కూడా భారత కరెన్సీ చాలా కాలంగా చెలామణిలో ఉంది. ప్రత్యేకించి ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో భారత కరెన్సీ చెలామణి ఎక్కువగా ఉంటుంది. నేపాల్‌కు వెళ్లే టూరిస్టులు కూడా భారత కరెన్సీని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, రద్దయిన నోట్లను భారత్ ఇప్పటి వరకు తీసుకోకపోవడంతో నేపాల్ వాటిని తీసుకోవాలని కోరుతోంది. అవేవీ అక్రమ మార్గంలో వచ్చినవి కాదని, నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ అయినవి కాబట్టి వాటిని భారత్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ విషయంలో భారత్ ఎందుకు సర్దుకుపోవడం లేదని ప్రదీప్ కుమార్ గ్యావాలీ అన్నారు.

2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత వాటిని మార్చుకోవడానికి గడువు విధించింది. అదే సమయంలో నేపాల్‌లో కూడా కొందరు ఆ నోట్లను మార్చుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా సుమారు రూ.15.31లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకులకు చేరాయి. అంటే ఆర్బీఐ జారీ చేసిన దాంట్లో సుమారు 99.3 శాతం మళ్లీ రిటర్న్ వచ్చాయి.

‘ఇది భారత్ చేతిలో ఉన్న నిర్ణయం. ఇండియా సానుకూలంగా స్పందిస్తుందని మేం ఆశిస్తున్నాం’ అని నేపాల్ ఆర్థికమంత్రి యువరాజ్ ఖతివాడా పీటీఐకి తెలిపారు. నేపాల్ వాణిజ్యం, సరఫరాల పరంగా భారత్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. పాత నోట్లను భారత ప్రభుత్వం తీసుకోకపోవడంతో నేపాల్ కొన్ని రోజుల క్రితం ఇండియా ప్రవేశపెట్టిన రూ.2000, రూ.200 నోట్లను తీసుకోకూడదని నిర్ణయించింది. కేవలం రూ.100 నోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 26, 2020, 7:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading