NEIGHBORING CHINA IS IMPOSING INNOVATIVE PUNISHMENTS ON CITIZENS WHO VIOLATE REGULATIONS IN THE WAKE OF THE OMICRON CORONA PRV
Omicron: ఒమిక్రాన్ కరోనా నేపథ్యంలో పొరుగు దేశంలో వినూత్న శిక్షలు.. నిబంధనలు ఉల్లఘించిన పౌరులను ఏం చేస్తున్నారంటే..
ప్రతీకాత్మక చిత్రం
ఒమిక్రాన్ ధాటికి ఫ్రాన్స్ చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికా, బ్రిటన్లో కూడా కేసులు ఎక్కువయ్యాయి. అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో భారత్‌లోనూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా, ఒమిక్రాన్ నేపథ్యంలో మన పొరుగు దేశంలో వినూత్న శిక్షలు విధిస్తున్నారు.
దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ (Omicron) వైరస్‌పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒమిక్రాన్ ధాటికి ఫ్రాన్స్ చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికా, బ్రిటన్లో కూడా కేసులు ఎక్కువయ్యాయి. అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో భారత్‌లోనూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా, ఒమిక్రాన్ నేపథ్యంలో మన పొరుగు దేశంలో (neighboring country) వినూత్న శిక్షలు విధిస్తున్నారు.
10 రోజుల జైలు శిక్ష..
ప్రపంచంలో వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఒక్క కేసు కూడా ఇప్పటివరకు చైనా (China)లో నమోదు కాలేదు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తేనే వాహనాలను రోడ్లపైకి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. స్థానిక ఆరోగ్య అధికారులు, పోలీసులు అన్ని కార్లను పర్యవేక్షిస్తున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి 10 రోజుల జైలు శిక్షతో (10 days imprisonment) పాటు రూ.5,800 జరిమానాను శిక్షలుగా విధిస్తున్నారు. అంతేకాదు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం కోరుతుంది. అవసరమైన పనుల కోసం వెళ్లాల్సిన వ్యక్తులు మాత్రమే జియాన్‌లో ప్రయాణించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
చైనా కరోనా నిబంధనలను (చైనా షేమింగ్ కోవిడ్ రూల్స్ బ్రేకర్) ఉల్లంఘిస్తున్న వ్యక్తులు బహిరంగంగా శిక్షలు విధిస్తోంది. వారు సిగ్గుపడేలా చేస్తోంది చైనా. తాజాగా చైనాలోని గ్వాంగ్జీలో కరోనా నిబంధనలను పాటించని నలుగురు వ్యక్తులను అధికారులు అవమానపడేలా శిక్షలు విధించారు.
ప్రస్తుతం ఈ వీడియో బహిర్గతం వెలుగులోకి వచ్చింది. మూసివేసిన సరిహద్దుల వద్ద (At closed boundaries) ఈ నలుగురు వ్యక్తులు వలసదారులకు సహాయం చేసి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని తెలుస్తోంది.
తెల్లటి సూట్లు ధరించిన నలుగురు పురుషులను గ్వాంగ్జీలోని జింగ్సీ (Jingxi in Guangxi) నగరం చుట్టూ ఊరేగించారు (Marched around the city). ఈ సమయంలో భారీగా ప్రజలు, పోలీసులు కూడా ఉన్నారు. ఈ నలుగురు వ్యక్తులు చిత్రాలు, పేర్లతో కూడిన ప్లకార్డులు (Placards) పట్టుకుని కనిపించారు.
కవాతు చేస్తున్న వీరితో పాటు ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. చైనాలో కఠినమైన కోవిడ్ చట్టాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే డ్రాగన్ కంటే తమ పొరుగు దేశాల సరిహద్దులను మూసివేసింది.
జింగ్సీ నగరం వియత్నాంతో చైనాకు సరిహద్దుగా ఉంది. అయితే ఈ సరిహద్దు ప్రాంతాల్లో కరోనా నిబంధనలను ఎవరు ఉల్లగించినా ఇలా శిక్షకు గురవుతారని..ప్ల కార్డులు పట్టుకుని పరేడ్ చేయాల్సి ఉంటుందని.. స్థానికుల హెచ్చరించినట్లు చైనాలోని ఓ ప్రాంతీయ వార్తా ఛానెల్ తెలిపింది
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.