news18
Updated: November 28, 2020, 10:14 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 28, 2020, 10:14 PM IST
మాయదారి మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మొత్తం భూ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్న మహమ్మారికి దాదాపు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. బయటకెళ్దామంటేనే జనం వణికిపోతున్నారు. కొద్దిరోజులుగా సెకండ్ వేవ్ తో మళ్లీ ఈ మాయరోగం కోరలు విప్పుతున్నది. అయితే గతంలో విధించిన లాక్డౌన్ ఫలితంగా వైరస్ కట్టడి సంగతి అటుంచితే... మరో ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా ను కట్టడి చేయడానికి విధించిన లాక్డౌన్ కారణంగా ఫార్మసీ షాప్స్ మూసేయడంతో చాలా మందికి గర్భ నిరోధక మాత్రలు దొరకలేదట.
గర్భ నిరోధక మాత్రలు, కండోమ్స్ వంటివి దొరకకపోవడంతో చాలా మంది వాటిని ఉపయోగించలేదు. దీంతో ఈ ఏడాది భారత్ లో జనాభా సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, యూని ఎయిడ్స్ నివేదికల ప్రకారం.. భారత్ లో సుమారు 2.5 కోట్ల జంటలు.. లాక్డౌన్ కారణంగగా గర్భనిరోధక మాత్రలు వాడలేదట. భారత్ తో పాటు మధ్య ఆదాయ, అల్పాదాయ దేశాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. ఇవి జనాభా పెరుగుదలకు దారి తీస్తాయని నివేదిక తేల్చి చెప్పింది.

ప్రతీకాత్మక చిత్రం
గర్భనిరోధక మాత్రలతో పాటు కండోమ్స్ కూడా దొరకకపోవడంతో ఎయిడ్స్ కేసులు కూడా పెరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ఈ కారణంగా 2020-22 మధ్య కాలంలో హెచ్ఐవీ ఎయిడ్స్ కేసులు కూడా పెరుగుతాయని నివేదిక హెచ్చరించింది. సుమారు లక్షా 50 వేల నుంచి 3 లక్షల వరకు కొత్త కేసులు.. 70 వేల నుంచి లక్షా 50 వేల కొత్త మరణాలు సంభవించవచ్చునని అంచనా వేసింది.
Published by:
Srinivas Munigala
First published:
November 28, 2020, 10:14 PM IST