Home /News /international /

NEARLY 1000 UKRAINE SOLDIERS SURRENDER TO RUSSIA AT MARIUPOL FACTORY PVN

Russia-Ukraine War : పెద్ద సంఖ్యలో రష్యాకు లొంగిపోయిన ఉక్రెయిన్ సైనికులు..ఇక యుద్ధం ముగిసినట్లేనా!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ukraine Soldires Surrender   :రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War)లో కీలక పరిణామం జరిగింది. మారియుపోల్ నగరం ( Mariupol) రష్యా హస్తగతమైంది. మారియుపోల్ నగరంలో దాదాపు మూడు నెలల పాటు రష్యా సైన్యంతో పోరాడిన ఉక్రెయిన్ సైన్యం(Ukraine Army)చివరకు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

ఇంకా చదవండి ...
Ukraine Soldires Surrender   :రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War)లో కీలక పరిణామం జరిగింది. మారియుపోల్ నగరం ( Mariupol) రష్యా హస్తగతమైంది. మారియుపోల్ నగరంలో దాదాపు మూడు నెలల పాటు రష్యా సైన్యంతో పోరాడిన ఉక్రెయిన్ సైన్యం(Ukraine Army)చివరకు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నగరంలోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార (Azovstal steel plant) ప్రాంగణ బంకర్లలో తలదాచుకుంటూ ఇన్నాళ్లు పుతిన్ సేనలను ఎదురిస్తూ మారియుపోల్ రక్షణలో నిమగ్నమైన ఉక్రేనియన్ సైనికులు మంగళవారం రేషన్‌లు, ఆయుధాలు మరియు మందులు అయిపోయిన తర్వాత లొంగిపోయారు. వారాల తరబడి పోరాడిన ఉక్రెయిన్‌ సైనికుల్లో దాదాపు వెయ్యి మంది తమకు లొంగిపోయారని రష్యా ప్రకటించింది. మేరియుపొల్‌ నగరంలోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగార ఆవరణను పుతిన్‌ సేనలు మంగళవారం స్వాధీనం చేసుకొని, అక్కడి నుంచి పలువురు ఉక్రెయిన్‌ సైనికుల్ని తమ నియంత్రణలోని భూభాగంలోకి తరలించింది రష్యా. అయితే ఇది తరలింపా, లొంగుబాటా అనే అనుమానాలున్న నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఇగోర్‌ కొనషెన్‌కోవ్‌ బుధవారం స్పష్టతనిచ్చారు. కర్మాగార ప్రాంగణాన్ని వీడి 959 మంది బయటకు వచ్చారని చెప్పారు.

అయితే ఖైదీల మార్పిడి కింద వీరిని తిరిగి వెనక్కి తీసుకువస్తామని ఉక్రెయిన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా... రష్యా మాత్రం వారిలో కొందరినైనా యుద్ధ నేరాల కింద విచారించబోతున్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌ సైనికుల్ని విచారిస్తామని రష్యా దర్యాప్తు సంస్థ తెలిపింది. అక్కడి అజోవ్‌ రెజిమెంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని సుప్రీంకోర్టును కోరే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సైనికులు లొంగిపోవడాన్ని ధైర్యానికి ప్రతిరూపంగా అభివర్ణించారు. ఆయన అజోవ్ బెటాలియన్‌ను అనేక వందల సంవత్సరాల క్రితం పర్షియన్ సైన్యంతో పోరాడిన స్పార్టన్ సైనికులతో పోల్చాడు.

ALSO READ  Putin Health : ఏ నిమిషానికి ఏమి జరుగునో..పుతిన్ కు తీవ్ర అనారోగ్యం

కాగా,మారియుపోల్ నగరం రష్యాకు అనేక విధాలుగా చాలా ముఖ్యమైనది. గతంలో రష్యా స్వాధీనం చేసుకున్నక్రిమియా (Crimea)లో తాగునీటి కొరత ఉంది. వాళ్లు తాగునీటిని మారియుపోల్ గుండా ప్రవహించే నది నుండి పొందేవారు. కానీ 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత ఉక్రెయిన్ ఈ నది జలాలను కాలువ ద్వారా క్రిమియాకు వెళ్లకుండా అడ్డుకుంది. అప్పటి నుంచి అక్కడ నీటి ఎద్దడి కొనసాగుతోంది. ఇప్పుడు మారియుపోల్ స్వాధీనంతో, క్రిమియాలో మంచినీటి సమస్య శాశ్వతంగా ముగుస్తుంది.

క్రిమియాకు భూమార్గం ద్వారా చేరుకోవాలంటే మారియుపోల్ లేదా డాన్‌బాస్‌ గుండా వెళ్లాల్సి ఉంటుంది. రష్యా ఇటీవల స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన లుహాన్‌స్క్‌, డోనెట్‌స్క్‌ ప్రాంతాలు.. డాన్‌బాస్‌లోనే ఉన్నాయనే సంగతి తెలిసిందే. సముద్రం ద్వారా ఈ రెండు ప్రాంతాలకు సైన్యాన్ని పంపడానికి మారియుపోల్ ఓడరేవు నగరం ఒక ముఖ్యమైన గేట్‌వే. ఉక్రెయిన్ మారియుపోల్ ద్వారా మాత్రమే సముద్ర వాణిజ్యం చేసేది మరియు ఇక్కడ నుండి దాని నౌకాదళం పనిచేసింది. ఈ నగరాన్ని ఇప్పుడు రష్యా ఆక్రమించడంతో ఉక్రెయిన్ వాణిజ్యం, నౌకదళ కార్యకలాపాలు ఇక నిలిచిపోనున్నాయి. ఈ కారణాల వల్ల, రష్యా సైన్యం గత 3 నెలలుగా మారియుపోల్‌పై దాడులు చేస్తుంది.

ALSO READ  Wonder : ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు..ఫసిఫిక్ సముద్ర గర్భంలో పసుపు ఇటుకల రోడ్డు

మరోవైపు,రష్యా తమపైనా దురాక్రమణకు దిగవచ్చనే ఉద్దేశంతో నాటో(NATO)కూటమిలో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్‌, స్వీడన్‌ బుధవారం దానికి సంబంధించిన దరఖాస్తులను బ్రసెల్స్‌ లోని కూటమి ప్రధాన కార్యాలయానికి పంపించాయి. నాటో సభ్యదేశాల్లో ఒకటైన టర్కీ- వీటి చేరికపై అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఈ రెండు దేశాలు అధికారిక ప్రక్రియతో ముందుకు సాగుతున్నాయి. కొత్త దేశం నాటోలో చేరాలంటే అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరి. దీనికి రెండు వారాల సమయం పడుతుంది. అమెరికా సహా నాటోలోని చాలా దేశాలు ఫిన్లాండ్‌, స్వీడన్‌ను స్వాగతిస్తున్నాయి.బలగాల మోహరింపును చూసి స్పందిస్తాం: భవిష్యత్తులో స్వీడన్‌ తన సైనిక బలగాన్ని ఎలా వినియోగిస్తుందనే దానిపై తమ స్పందన ఆధారపడి ఉంటుందని రష్యా తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు