స్వదేశ్ : నవాజ్ షరీఫ్‌ అరెస్టుకు రంగం సిద్ధం

ప్రజల కోసమే తాను ఈ త్యాగం చేస్తున్నానని, పాకిస్థాన్ తనకు అండగా నిలబడాలని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: July 13, 2018, 11:09 PM IST
స్వదేశ్ : నవాజ్ షరీఫ్‌ అరెస్టుకు రంగం సిద్ధం
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మార్యం షరీఫ్
  • Share this:
పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అరెస్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. షరీఫ్ మద్దతు దారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. లాహోర్‌ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అభిమానులు, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో పదివేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అల్లర్లు, విధ్వంసం తలెత్తకుండా ముందస్తుగా కొందరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నవాజ్ విమానం దిగగానే
ఆయన్ను అరెస్ట్ చేసేందుకు 16 మందితో టీమ్ రెడీగా ఉంది. మరో రెండు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మార్యం షరీఫ్‌ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6న పాకిస్థాన్‌‌లోని కోర్టు నవాజ్ షరీఫ్‌ అవినీతికి పాల్పడి లండన్‌లోని అవెన్ ఫీల్డ్‌లో విల్లాలు కొనుక్కున్నారని తీర్పు చెప్పింది. ఈ కేసులో దోషిగా తేలుస్తూ.. నవాజ్‌కు పదేళ్లు, ఆయన కుమార్తెకు ఏడేళ్లు, అల్లుడికి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. యూకేలో ఉన్న షరీఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకొనేలా అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించాలని అధికారులను ఆదేశించింది. అయితే, తాము ఎలాంటి తప్పు చేయలేదని, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌తో కుట్రపన్నిన సైన్యం తనపై కోర్టు ద్వారా కక్షసాధిస్తోందని తండ్రీకూతుళ్లు ఆరోపించారు.

లండన్ నుంచి బయలుదేరే ముందు పిల్లలకు ధైర్యం చెబుతున్న నవాజ్ షరీఫ్ కుమార్తె మార్యం షరీఫ్
లండన్ నుంచి బయలుదేరే ముందు పిల్లలకు ధైర్యం చెబుతున్న నవాజ్ షరీఫ్ కుమార్తె మార్యం షరీఫ్


కోర్టు తీర్పు ప్రకారం జైలు శిక్ష అనుభవించేందుకు నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె సిద్ధమయ్యారు. లండన్ నుంచి దుబాయ్ మీదుగా వారు పాక్ వస్తున్నారు. పాకిస్థాన్ ప్రజల కోసమే తాము ఇదంతా చేస్తున్నామని ప్రజలు తమతో కలసి నడవాలంటూ పీఎంఎల్(ఎన్) ట్విటర్ అకౌంట్‌లో నవాజ్ షరీఫ్ వీడియో పోస్ట్ చేశారు. అదే సమయంలో పిల్లలకు భరోసా ఇస్తున్న మార్యం షరీఫ్ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


మరోవైపు ఈనెల 25న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ధీమాగా ఉన్నారు. ఇక ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు.

సెల్‌ఫోన్ సేవలను నిలిపివేస్తున్నట్టు జారీ అయిన ఉత్తర్వులు
సెల్‌ఫోన్ సేవలను నిలిపివేస్తున్నట్టు జారీ అయిన ఉత్తర్వులు
First published: July 13, 2018, 2:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading