మాజీ ప్రధాని పరిస్థితి విషమం... డాక్టర్లు ఏమంటున్నారంటే...

Nawaz Sharif : నవాజ్ షరీఫ్ మృత్యువుతో పోరాడుతున్నారని ఆయన వ్యక్తిగత డాక్టర్ తెలిపారు.

news18-telugu
Updated: October 29, 2019, 3:00 PM IST
మాజీ ప్రధాని పరిస్థితి విషమం... డాక్టర్లు ఏమంటున్నారంటే...
నవాజ్ షరీఫ్ (File)
  • Share this:
Nawaz Sharif : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి తీవ్ర అస్వస్థత కలిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన మృత్యువుతో పోరాడుతున్నారని నవాజ్ షరీష్ వ్యక్తిగత డాక్టర్ అద్నాన్ ఖాన్ తెలిపారు. దీనిపై వరుస ట్వీట్లు చేసిన అద్నాన్... నవాజ్ షరీఫ్‌కి థ్రోంబోసైటోపెనియా (ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం), NSTEMI (హార్ట్ ఎటాక్)తోపాటూ... కిడ్నీలు కూడా సరిగా పనిచేయట్లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు బ్లడ్ షుగర్ లెవెల్ సరిగా లేదనీ... బీపీ కూడా బాగా పెరిగిపోతోందని వివరించారు. నవాజ్ షరీఫ్‌కి తీసిన స్కానింగ్స్, బయోప్సీస్ ద్వారా ఆయనకు మరిన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయనీ, అవన్నీ ఆయనకు అత్యంత ప్రమాదకరంగా మారాయని తెలిపారు.

నవాజ్ షరీఫ్‌కి డయాగ్నోస్ చెయ్యడంలో డాక్టర్ల బృందం ఎంత శ్రమించినా ఫలితం కనిపించట్లేదని తెలిసింది. ఫలితంగా ఆయన మృత్యువుతో పోరాడుతున్నారని అంటున్నారు. గతవారం లాహోర్‌లోని ఆస్పత్రిలో చేరినప్పటి నుంచీ ఆయన 7 కేజీలు బరువు తగ్గారు. ఆస్పత్రిలో చేరినప్పుడు 107 కేజీలున్న ఆయన... ప్రస్తుతం 100 కేజీలున్నట్లు డాక్టర్లు తెలిపారు.


Pics : అందాల బ్యూటీ అశ్రితా శెట్టి క్యూట్ పిక్స్

ఇవి కూడా చదవండి :

బోరుబావి చిన్నారి సుర్జిత్ మరణంపై స్పందించిన రజనీకాంత్

టెర్రర్ టార్గెట్ లిస్టులో టీమిండియా... రంగంలోకి దిగిన NIA

Health Tips : రాత్రి త్వరగా భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


Health Tips : రేగుపండ్లు తింటున్నారా... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు


Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...
Published by: Krishna Kumar N
First published: October 29, 2019, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading