నవాజ్ కుటుంబానికి జైలు శిక్ష రద్దు!

షరీఫ్‌తో పాటు, ఆయన కూతురు పేరోల్‌పై తిరిగి జైలుకు వెళ్లారు. తాజా తీర్పుతో లాంఛనాలు ముగిశాక విడుదల చేయనున్నారు.

news18-telugu
Updated: September 19, 2018, 6:26 PM IST
నవాజ్ కుటుంబానికి జైలు శిక్ష రద్దు!
నవాజ్ షరీఫ్, మరియం నవాజ్
  • Share this:
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం నవాజ్‌కు భారీ ఊరట లభించింది. పనామా పేపర్స్ అవినీతి కేసులో అనుభవిస్తున్న జైలు శిక్షను రద్దు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లాంఛనాలు పూర్తైన తర్వాత తండ్రీకూతుళ్లను విడుదల చేయనున్నారు.

కొద్ది రోజుల క్రితం నవాజ్ షరీఫ్ భార్య కుల్సోం లండన్‌లో క్యాన్సర్‌తో చనిపోయారు. నవాజ్ షరీఫ్, ఆయన కూతురు ఐదు రోజుల పేరోల్‌పై వెళ్లి తిరిగి జైలుకొచ్చారు. అయితే షరీఫ్ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్లను ఇస్లామాబాద్‌ హైకోర్టులో ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది. వారికి జైలు శిక్ష రద్దు చేయడంతో తండ్రీకూతుళ్లతో పాటు నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దర్ కూడా విడుదల కానున్నారు. షరీఫ్, మరియం, సఫ్దర్లు రూ.5 లక్షల విలువైన బెయిల్ బాండ్స్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు తీర్పు వెలువరించగానే నవాజ్ మద్దతుదారులు కోర్టు పరిసరాల్లో సంబరాలు చేసుకున్నారు. అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీస్ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు జూలైలో అరెస్టైన సంగతి తెలిసిందే. షరీఫ్‌కు పదేళ్లు, మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.

ఇవి కూడా చదవండి:ఆస్పిరిన్ గుండెపోటును అడ్డుకోదు!

బ్యాంకుల విలీనం: ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

సెప్టెంబర్ 24న 'మోటోరోలా వన్ పవర్' లాంఛింగ్!Video: కాపురాల్లో చిచ్చురేపుతున్న వీడియో గేమ్ వ్యసనం!

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే లాభాలేంటో తెలుసా? 
First published: September 19, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>