క్షీణించిన నవాజ్ షరీఫ్ ఆరోగ్యం

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్‌ను రావల్పిండి జైలు నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: July 29, 2018, 10:34 PM IST
క్షీణించిన నవాజ్ షరీఫ్ ఆరోగ్యం
నవాజ్ షరీఫ్ (File)
  • Share this:
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆరోగ్యం క్షీణించింది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన్ను రావల్పిండిలోని ఆదియాల జైలు నుంచి పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. నవాజ్ షరీఫ్ తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్నారు. జైల్లో ఆయనకు సరైన వైద్యం అందకపోవడంతో ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే మాజీ ప్రధానిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

నవాజ్ షరీఫ్‌ను పరీక్షించిన వైద్యులు కరోనరీ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారని జియో న్యూస్ వెల్లడించింది. రావల్పిండిలోని జైలులో ఆయనకు నిర్వహించిన కార్డియోగ్రామ్ పరీక్షలో లోటుపాట్లు గుర్తించిన వైద్యులు ఆయనను ఆస్పత్రికి తరలించాలని సూచించారు. నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితిపై ఈ నెల 24న వైద్య మండలిని నియమించిన సంగతి తెలిసిందే. షరీఫ్‌కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఐదుగురు సభ్యులతో కూడిన వైద్య మండలి సూచించింది.


నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడు అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న కేసులో పాక్‌లోని స్థానిక కోర్టు ఆ ముగ్గురికి జైలు శిక్ష విధించింది. దీంతో వారు లండన్ నుంచి వచ్చి లొంగిపోయారు. తండ్రీకూతుళ్లను పోలీసులు రావల్పిండి జైలుకు తరలించారు. అయితే, ఇమ్రాన్ ఖాన్‌తో కుమ్మక్కైన మిలటరీ.. తమపై కక్షసాధిస్తోందని వారు ఆరోపించారు. మరోవైపు ఈనెల 25న జరిగిన పాక్ జనరల్ ఎలక్షన్స్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ 116 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్) 64, మరో మాజీ ప్రధాని బెన్‌జీర్ బుట్టోకు చెందిన పీపీపీ పార్టీకి 43 సీట్లు దక్కించుకున్నాయి.

 
First published: July 29, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>