Nawaz Sharif: పాక్‌ మాజీ ప్రధానికి నవాజ్ షరీఫ్‌కు షాకిచ్చిన బ్రిటన్.. ఆ దరఖాస్తును తిరస్కరించిన హోం ఆఫీస్..

నవాజ్ షరీఫ్(ఫైల్ ఫొటోే

వైద్య చికిత్స కోసం నాలుగు వారాలు విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు షరీఫ్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో లండన్ వచ్చిన షరీఫ్.. 2019 నవంబర్ నుంచి అక్కడే ఉంటున్నాడు

  • Share this:
    పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు బ్రిటన్‌ షాక్‌ ఇచ్చింది. వీసా పొడిగింపు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును యూకే హోం ఆఫీస్‌ తిరస్కరించింది. ఈ మేరకు శుక్రవరం మీడియాలో కథనాలు వెలువడ్డాయి. షరీఫ్.. పాకిస్తాన్‌లో రెండు అవినీతి కేసులో దోషిగా నిర్దారించింది. దీంతో కోర్టు 2018లో ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ క్రమంలోనే షరీఫ్ కొద్ది రోజులు జైలు జీవితం గడిపాడు. అయితే వైద్య చికిత్స కోసం నాలుగు వారాలు విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. దీంతో లండన్ వచ్చిన షరీఫ్.. 2019 నవంబర్ నుంచి అక్కడే ఉంటున్నాడు.‘నవాజ్ షరీఫ్ వీసా గడువును మరింతగా పొడగించకుండా యూకే హోం ఆఫీస్ నిర్ణయం తీసుకుంది’ అని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు చెప్పినట్టుగా డాన్ న్యూస్ పేర్కొంది. అయితే హోం ఆఫీస్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయవచ్చని, అప్పటివరకు షరీఫ్ యూకేలోనే ఉంటారని జౌరంగజేబు అన్నారు.

    వీసా పొడిగింపు పెండింగ్‌లో ఉన్న సమయంలో ఒక విదేశీ పౌరుడు ఒకేసారి ఆరు నెలలకు మించి యూకేలో ఉండలేరు. అయితే ఇప్పటివరకు వీసా గడువును వంతుల వారీగా పెంచుకుంటూ ఆయన అక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. షరీఫ్ ప్రస్తుత వీసా గడువు ఎప్పటివరకు చెల్లుబాటు అవుతుందనే దానిపై స్పష్టత లేదని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    వీసా గడుపు పొడిగింపు తిరస్కరణపై షరీఫ్‌ తరపు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. లండన్‌లో ఆయన చికిత్సను కొనసాగించటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా చెప్పారు. హోం ఆఫీస్ నిర్ణయంపై బ్రిటీష్‌ ఇమిగ్రేషన్‌ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌కు వెళ్లామని తెలిపారు. అయితే రాజకీయంగా శక్తివంతమైన నవాజ్ షరీఫ్ కుటుంబానికి యూకే హోం ఆఫీస్ నిర్ణయం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే షరీఫ్ ఆరోగ్య పరస్థితి దృష్ట్యా.. ఆయన యూకే‌లో ఉండేందుకు బలమైన కారణం ఉందని షరీఫ్ కుటుంబ సభ్యులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు. పీఎంఎల్-ఎన్ ప్రతినిధులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: