Nasal vaccines: భారత నాసల్ వ్యాక్సిన్లపై WHO హర్షం... కరోనాకి మూడినట్లేనా?

భారత నాసల్ వ్యాక్సిన్లపై WHO హర్షం...

Nasal vaccines: ఆదివారం ఓ సంచలన వార్త తెరపైకి వచ్చింది. ఇండియాలో తయారవుతున్న నాసల్ వ్యాక్సిన్లు (ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్లు)... కరోనాను అంతం చేయడంలో... గేమ్ ఛేంజర్లుగా మారబోతున్నాయా?

 • Share this:
  Nasal vaccines: ఇప్పటివరకూ కరోనాకు విరుగుడుగా ఇస్తున్న వ్యాక్సిన్లన్నీ భుజానికి ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నవే. ఐతే... తాజాగా... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లోని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ సంచలన విషయాలు చెప్పారు. ఇండియాలో కరోనాకి విరుగుడుగా తయారవుతున్న నాసల్ వ్యాక్సిన్ల (ముక్కు ద్వారా వ్యాక్సిన్ ఇచ్చేవి)లో కొన్ని పిల్లల పట్ల గేమ్ చేంజర్లుగా మారగలవు అన్నారు. CNN న్యూస్18కి ఆమె ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియాలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభంలో... జోరుగా ఉన్నా... ఇప్పుడు కాస్త మందగించిందనే అంశంపై ఆమె అభిప్రాయం కోరగా... ఆమె తనదైన విశ్లేషణ చేశారు.

  "ఇండియాలో సమస్య సప్లైతో ఉంది. ఇండియాలో కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం అహరహం కృషి చేస్తున్నాయి. నాకు తెలుసు... ఇందుకు టైమ్ పడుతుంది. మరికొన్ని నెలల్లో మనం మార్పు చూస్తాం. కోవిషీల్డ్, కోవాగ్జిన్ మాత్రమే కాదు... ఇతర వ్యాక్సిన్లు కూడా ఇండియాలో తయారవుతాయి. విదేశీ వ్యాక్సిన్లు ఆగస్ట్, సెప్టెంబర్ సమయంలో ఇండియాలోకి వస్తాయి. అప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత జోరందుకుంటుంది. ఈలోగా ఏం చెయ్యాలంటే... గ్రూపుల వారీగా ప్రాధాన్యాలు రెడీ చేసుకోవాలి. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే 45 ఏళ్లు దాటిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఎవరికైతే వ్యాక్సిన్ అత్యవసరమో వారికి వేసేలా ప్రాధాన్యాలు ఉండాలి." అని ఆమె అన్నారు.

  స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు తిరిగి ఎప్పుడు ప్రారంభించాలనే అంశంపై సౌమ్య స్వామినాథన్ స్పందించారు. "పిల్లలకు సంబంధించి చాలా వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. ఆల్రెడీ ఫైజర్ వ్యాక్సిన్ 12 ఏళ్లు దాటిన వారికి వెయ్యవచ్చని నిరూపించింది. అలాగే... అంతకంటే తక్కువ వయసువారిపై ట్రయల్స్ జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అనుమతి పొందగలవు. పిల్లలకు సంబంధించి ఆస్త్రాజెనెకా లాంటి వ్యాక్సిన్ల ప్రయోగాలు కాస్త నెమ్మదిగా ఉన్నాయి. అయినప్పటికీ... ఇండియాలో తయారవుతున్న కొన్ని నాసల్ వ్యాక్సిన్లు... గేమ్ చేంజర్లు కాగలవని ఆశిస్తున్నాను. అవి స్థానికంగా తయారవుతున్నాయి కాబ్టటి... స్థానికులకు ఇమ్యూనిటీని పెంచేలా ఉంటాయి. ఐతే... పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ఈ సంవత్సరం తయారు అవ్వకపోవచ్చు. సామూహిక వ్యాప్తి తగ్గినప్పుడు మనం స్కూళ్లు, యూనివర్శిటీలూ తెరచుకోవచ్చు. ఇతర దేశాల్లో అదే జరుగుతోంది. అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. టీచర్లందరికీ వ్యాక్సిన్ పూర్తవ్వాలి. అది ముఖ్యమైన అంశం." అని ఆమె తెలిపారు.  ఇది కూడా చదవండి: Cinnamon Tea: రోజూ దాల్చిన చెక్క టీ తాగండి... మీలో ఈ మార్పులు వస్తాయి

  ఇండియాలో గత 18 నెలలుగా ఉన్న కరోనాకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే సౌమ్య స్వామినాథన్ స్పందించారు. "ప్రతి రోజూ కరోనా గురించి నేర్చుకుంటూ ముందుకు సాగాలి అన్నారు. ఇండియానే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే... ఓవరాల్ వ్యూ ఎలా ఉందో తెలుస్తుంది. ఇతర దేశాల్లోవి మనం నేర్చుకొని... మన దగ్గర వెంటనే అమలు చెయ్యవచ్చు. సైన్స్ చాలా గొప్పది. ఇలాంటి సైన్స్ సంబంధిత అంశాల్లో నేను నా సేవలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియా సహా అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఇదో సవాలుతో కూడుకున్నది." అని తెలిపారు.
  Published by:Krishna Kumar N
  First published: