• HOME
 • »
 • NEWS
 • »
 • INTERNATIONAL
 • »
 • NASA URANUS NASA ASTRONOMERS FOUND FIRST X RAYS FROM THE PLANET URANUS WHY THEY COME HERE IS THE FULL DETAILS NK

NASA Uranus: యురేనస్ గ్రహం నుంచి ఎక్స్‌రే కిరణాలు.. గుర్తించిన నాసా ఏం చెప్పింది?

NASA Uranus: యురేనస్ గ్రహం నుంచి ఎక్స్‌రే కిరణాలు.. గుర్తించిన నాసా ఏం చెప్పింది?

యురేనస్ గ్రహం నుంచి ఎక్స్‌రే కిరణాలు (Image credit: www.nasa.gov/sites/default/files/thumbnails/image/uranus.jpg)

NASA Uranus: ఈ ప్రపంచంలోని టెలిస్కోపులు... విశ్వాన్ని గమనిస్తున్నాయి. మన సౌర కుటుంబంలోని గ్రహాల గురించే ఇంకా మనకు తెలియనిది చాలా ఉంది. యురేనస్ గురించి నాసా ఏం చెప్పిందో తెలుసుకుందాం.

 • Share this:
  NASA Uranus: అమెరికా స్పే్స్ ఏజెన్సీ నాసా (NASA) అప్పుడప్పుడూ ఆశ్యర్యపోయే విషయాలు చందమామ కథల్లా చెబుతుంది. ఇది అలాంటిదే. మన భూమికి 309 కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్న యురేనస్ (Uranus) గ్రహం నుంచి వచ్చిన ఎక్స్‌రేస్ (X-rays) కిరణాలను వ్యోమగాములు గుర్తించారు. నాసాకి చెందిన చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ వాటిని గుర్తించింది. ఈ పరిశోధన ద్వారా... మొత్తం మంచుతో గడ్డకట్టినట్లుగా ఉండే భారీ గ్రహం యురేనస్‌ గురించి మరికొన్ని విషయాలు తెలుస్తాయని సైంటిస్టులు భావిస్తున్నారు. మీకు తెలుసుగా యురేనస్... మన భూమి కంటే నాలుగు రెట్లు పెద్దది. అక్కడ గనుక మనం జీవించే అవకాశం లభిస్తే... బోలెడంత స్థలం ఖాళీగా ఉంటుంది. కంటికి కనిపించే ఐదు గ్రహాల్లో ఇదీ ఒకటి. కానీ దీన్ని చూసి కూడా మనం ఇదో నక్షత్రం అనుకుంటూ ఉంటాం. గ్రీకు పురాణాల్లో భూ దేవత కొడుకును యురేనస్ అనేవారు.

  మన సూర్యుడి నుంచి యురేనస్... ఏడో గ్రహం. దాని మధ్య రేఖ చుట్టూ... రెండు రింగుల లాంటివి ఉంటాయి. శనిగ్రహానికి వలయాలు ఉంటాయి కదా సేమ్ అలాంటివే అన్నమాట. చిత్రమేంటంటే... సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ... తమ చుట్టూ తాము ఒకేలా తిరుగుతుంటే... ఈ ఒక్క గ్రహం మాత్రం మరో రకంగా తిరుగుతోంది. బ్లూ కలర్‌లో ఉండే యురేనస్ అలా ఎందుకు తిరుగుతోందో అర్థం కాని ప్రశ్న. ఇప్పటివరకూ వాయేజర్ 2 (Voyager 2) అనే స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే... యురేనస్ దగ్గరిదాకా వెళ్లింది. ప్రస్తుతం చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ, హబుల్ టెలిస్కోప్... ఈ రెండూ ఈ గ్రహాన్ని పరిశీలిస్తున్నాయి. మొత్తం హైడ్రోజన్, హీలియంతో ఉండే ఈ అతి చల్లని గ్రహం రహస్యాలు తెలుసుకుంటున్నాయి.


  2002లో చంద్ర అబ్జర్వేటరీతో... యురేనస్‌ని పరిశీలించారు. మళ్లీ 2017లో పరిశీలించారు. తాజా పరిశీలనలో... అత్యంత స్పష్టమైన ఎక్స్ రే కిరణాలు... యురేనస్ నుంచి రావడాన్ని గుర్తించారు. ఇంతకీ అవి ఎందుకు వచ్చాయి? అన్నది మన ప్రశ్న. కారణం సూర్యుడే అంటున్నారు. మన భూమిపై ఎండ పడితే... ఆ సూర్య కిరణాల్ని భూమి... అంతరిక్షంలోకి ప్రజ్వరిల్లేలా చేస్తుంది. అదే విధంగా గురుగ్రహం (Jupiter), శనిగ్రహం (Saturn) సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్ రే కిరణాల్ని తిరిగి అంతరిక్షంలోకి వదులుతాయి. మరి యురేనస్ విషయంలోనూ అదే జరుగుతోందా... లేక ఇంకేదైనా కారణం ఉందా అన్నదానిపై ఇంకా క్లారిటీకి రాలేదు అంటున్నారు నాసా సైంటిస్టులు.


  మరో కోణంలో... యురేనస్‌కి వలయాలు ఎక్స్ రే కిరణాల్ని వెదజల్లుతూ ఉండొచ్చు అంటున్నారు. శనిగ్రహం విషయంలో అలా జరుగుతోంది. యురేనస్ చుట్టూ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లూ ఉన్నాయట. అవి అలా అలా తిరుగుతూ... చూసుకోకుండా యురేనస్ వలయాల్ని ఢీకొంటే... అప్పుడు ఆ వలయాల నుంచి మెరుపు వస్తుందట. అదే ఎక్స్ రే కిరణాలు కావచ్చు అంటున్నారు.

  ప్రతి మనిషికీ తెలియనిది తెలుసుకోవాలనే కిక్ ఉంటుంది. నాసా, ఇస్రో లాంటి సంస్థల్లో శాస్త్రవేత్తలకు యురేనస్ లాంటి గ్రహాలు ఎక్కడలేని కిక్ ఇస్తున్నాయి. ఆల్రెడీ మార్స్ పై కాలనీ నిర్మించాలనే ఆలోచన సైంటిస్టులకు ఎంతో కిక్ ఇస్తోంది. తాజాగా యురేనస్ కూడా ఎక్స్ రే పజిల్ విసిరి... విప్పుకోండి చూద్దాం అంటోంది.

  ఇది కూడా చదవండి: Gardening Tips: ఇంటి గార్డెన్‌లో బెండకాయ మొక్కలు పెంచండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ

  చివరిగా ఒక్కమాట... ఈ చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీకి ఆ పేరు పెట్టడం వెనక మన భారతీయ శాస్త్రవ్తేత ఉన్నారు. ఆయనే నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఇండో-అమెరికన్ ఆస్ట్రోఫిజిస్ట్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. మరుగుజ్జు నక్షత్రాలు, బ్లాక్ హోల్స్‌పై ఆయన లోతైన పరిశోధనలు చేశారు. ఆయనకు గౌరవ సూచకంగా చంద్ర అబ్జర్వేటరీకి ఆ పేరు పెట్టారు.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు