Home /News /international /

NASA TO CRASH SPACECRAFT INTO ASTEROID TO TEST EARTH DEFENCES AGAINST COSMIC THREATS MK GH

Nasa: వ్యోమనౌకతో గ్రహశకలాన్ని ఢీ కొట్టనున్న నాసా.. కాస్మిక్ ముప్పు నుంచి భూమిని రక్షించేందుకు ప్రయోగం..

భూమిని రక్షించేందుకు ప్రయోగం.. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

భూమిని రక్షించేందుకు ప్రయోగం.. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఈ నెలలో ఒక వ్యోమనౌకను ప్రయోగించాలని భావిస్తోంది. కాస్మిక్ ముప్పు నుంచి భూమిని రక్షించేందుకు ఈ ప్రయోగం చేపడుతోంది. ఇందులో భాగంగా ఒక వ్యోమనౌకతో గ్రహశకలాన్ని ఢీకొట్టి పరీక్షించనుంది.

అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఈ నెలలో ఒక వ్యోమనౌకను ప్రయోగించాలని భావిస్తోంది. కాస్మిక్ ముప్పు నుంచి భూమిని రక్షించేందుకు ఈ ప్రయోగం చేపడుతోంది. ఇందులో భాగంగా ఒక వ్యోమనౌకతో గ్రహశకలాన్ని ఢీకొట్టి పరీక్షించనుంది. ఈ మిషన్ విజయవంతం అయితే భవిష్యత్తులో భూమి ఏదైనా ముప్పును ఎదుర్కొనేందుకు ఇలాంటి సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ఈ నెల 23న స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ( space x Falcon 9 rocket)ను ప్రయోగించడానికి కాలిఫోర్నియాలోని వాండెన్ బర్గ్ స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ సిద్దమవుతోంది. ఇది లక్ష్యాన్ని చేరుకునేందుకు సంవత్సరం సమయం పట్టవచ్చు.

డిడైమాస్, డిమోర్ఫాస్ రెండు గ్రహశకలాలు భూమి నుంచి కోటి పది లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకునే ఈ మిషన్ ప్రారంభించారు. డిమోర్ఫాస్ మార్గాన్ని మార్చడానికి వచ్చే ఏడాది సెప్టెంబరు, అక్టోబరు వరకు సమయం పడుతుంది. భవిష్యత్తులో భూమికి గ్రహశకలాల వల్ల వచ్చే ముప్పును కనుగొనడానికి ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పరీక్ష సమర్థవంతమైన మార్గంలో జరుగుతుందని నాసా భావిస్తోంది.

రాబోయే వంద సంవత్సరాల్లో భూమిని ఢీకొట్టబోయే వాటిల్లో, ఇప్పటి వరకు 140 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలం కనిపించలేదు. అలాంటి వాటిలో కేవలం 40 శాతం వరకు మాత్రమే అక్టోబరు 2021 నాటికి కొనుగొన్నారు. భూమికి దగ్గరగా కనిపించిన గ్రహశకలం పరిమాణం 780 మీటర్ల చుట్టుకొలతతో 160 మీటర్ల పరిమాణంలో ఉంది. దీంతె భూమికి ప్రమాదం పొంచి ఉన్న గ్రహశకలాలను పోలి ఉన్న డిమోర్ఫాస్ శకలాలను ఈ ప్రయోగాలకు ఎంచుకున్నారు. వ్యోమనౌక సెకనుకి 6.6 కిలోమీటర్ల వేగంతో డీమోర్పాస్ ని ఢీకొనడం ద్వారా డిడైమాస్ కు దగ్గరవుతుంది. ఈ ప్రాజెక్టును జాన్ హోప్ కిన్స్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోంది.

* గ్రహశకలాలు ప్రమాదకరమా?
దశాబ్దాల కాలంగా గ్రహశకలాల వల్ల భూమికి పొంచి ఉన్న ప్రమాదాలను ఖగోళశాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. 6.5 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు భూమిని ఢీకొట్టడం వల్ల 70 శాతం జీవరాశులు అంతరించిపోయాయి. గ్రహశకలాలు ఢీకొనడం వల్ల సునామీలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, కార్చిచ్చులు వ్యాపిస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

2013లో రష్యాలోని చెలీయాబిన్కు నగరం సమీపంలో భూమి వాతావరణానికి సమీపించిన ఎపోపిస్ గ్రహశకలం 500 టన్నుల టీఎన్టీకి సమానమైన శక్తికి విడుదల చేసింది. దీని వల్ల 3600 అపార్టుమెంట్ల అద్దాలు పగిలిపోయాయి. 1000 మందికిపైగా గాయపడ్డారు. ఎపోపిస్ గ్రహశకలం భవిష్యత్తులో భూమికి ఢీకొనే అవకాశం ఉందనే దానిపై ఖగోళశాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. 2068లో ఈ గ్రహశకలం భూమిని తాకవచ్చు. దీన్ని 2004లోనే గుర్తించారు. ఇది 2029లో భూమికి 32 వేల కిలోమీటర్ల దగ్గరగా రానుందని అంచనా వేశారు. దీని వ్యాసం సుమారు 340 మీటర్లు ఉంటుంది ఇది ఏడు ఒలంపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్ కు సమానం.

గ్రహశకలాలు భూమిని ఢీకొనే ముందే మనం కొనుగొనాలని నాసా పేర్కొంది. ఈ గ్రహశకలాల ప్రభావం ఒక్కటి మాత్రమే నివారించగల ప్రకృతి విపత్తు అని తెలిపింది. నాసా డార్ట్ చాలా జాగ్రత్తగా ఈ ప్రయోగాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించనుంది. కైనెటిక్ ఇంపాక్టర్ టెక్నాలజీ గ్రహశకలాల వేగం, మార్గాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. భూమికి ఇలాంటి విపరీత విపత్తుల నుంచి కాపాడుకోవడానికి ఈ మిషన్ ద్వారా అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published:

Tags: NASA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు