NASA: కొత్త సంవత్సరం మొదలైంది. భూమికి 93 మిలియన్ మైళ్లు (150 మిలియన్ కి.మీ) దూరంలో ఉన్న సూర్యుని చుట్టూ కొత్త కక్ష్యలో ప్రయాణం మొదలైంది. సూర్యుడిని చుట్టి రావడానికి భూమికి మరో ఏడాది పడుతుంది. ఈ సందర్భంగా NASA ఇటీవల సూర్యుడి అద్భుతమైన ఇమేజ్‌ను షేర్ చేసింది. నాసా విడుదల చేసిన ఫోటోలో సూర్యుడు స్ట్రాంగ్ సోలార్ ఫ్లేర్(మంటలు) విడుదల చేస్తున్నాడు. సోలార్ ఫ్లేర్ చాలా శక్తివంతమైనవి. ఇవి పేలుళ్లు, సౌర విస్ఫోటనాలు, రేడియో కమ్యూనికేషన్‌లు, ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్‌లు, నావిగేషన్ సిగ్నల్‌లను ప్రభావితం చేయగలవు. అంతరిక్ష నౌకలు, వ్యోమగాములకు ప్రమాదాన్ని కలిగిస్తాయని NASA పేర్కొంది.
సూర్యుడి ఇమేజ్ షేర్ చేసిన నాసా
నాసా పోస్ట్‌లో.. సూర్యుడి వయస్సు 4.5 బిలియన్ సంవత్సరాలకు పైగా ఉందని వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ఈ పోస్ట్ చేసింది. మన సూర్యుని చుట్టూ 93 మిలియన్ మైళ్ల (150 మిలియన్ కిమీ) దూరంలో ఉన్న కొత్త కక్షలో ప్రయాణం మొదలైందని, వీటన్నింటికి కేంద్రమైన స్టార్ ఆఫ్ ది షో సూర్యుడని పేర్కొంటూ.. సూర్యుడి ఇమేజ్‌ను షేర్ చేసింది.
సౌర వ్యవస్థలో కీలకం
సూర్యుడి ఎప్పటికప్పుడు మారుతున్న స్వభావం నిరంతరం సౌర వ్యవస్థలోకి శక్తిని విడుదల చేస్తుందని, శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థలోని అత్యంత పురాతన వస్తువుల ద్వారా సూర్యుడి వయసు అంచనా వేయగలరని పేర్కొంది. ఆ వస్తువులు సూర్యుడితో పాటు ఒకే సమయంలో ఏర్పడ్డాయని వివరించింది. సూర్యుడు మన సౌర వ్యవస్థ మధ్యలో ఉన్నాడని, 865,000 మైళ్ల వెడల్పు (1.4 మిలియన్ కి.మీ)తో 27 మిలియన్ డిగ్రీల ఫారెన్‌హీట్ (15 మిలియన్ డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతకు విడుదల చేసే కోర్‌తో ఉన్నాడని తెలిపింది. మన సూర్యుడి గురుత్వాకర్షణ మన సౌర వ్యవస్థను కలిపి ఉంచుతుందని, అతిపెద్ద గ్రహాల నుంచి అతి చిన్న అంతరిక్ష శిథిలాల వరకు సూర్యుడిపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది.
iPhone 14 Plus: ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.9 వేల డిస్కౌంట్..స్పెషల్ డీల్ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి..
నిరంత పర్యవేక్షణలో సూర్యుడు
స్పేస్‌క్రాఫ్ట్ సముదాయం సూర్యుడిని 24/7 పర్యవేక్షిస్తుందని నాసా తెలిపింది. సైన్స్‌లో సూర్యుడి గురించి నాలెడ్జ్ అందించే విభాగాన్ని హీలియోఫిజిక్స్ అని పేర్కొంటారని, షేర్ చేసిన ఇమేజ్‌ను సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ(SDO) తీసిందని నాసా చెప్పింది. SDO భూమిని జియోసింక్రోనస్ ప్యాటర్న్‌లో పరిభ్రమిస్తుంది. ఇది న్యూ మెక్సికో రేఖాంశంపై ఫిగర్-ఎయిట్ మార్గాన్ని మెయింటేన్ చేస్తుంది. దాని కక్ష్య కారణంగా, ఇది నిరంతరం భూమిపై రేడియో యాంటెన్నాలను చూస్తుంటుంది. ఇది గ్రహణ కాలంలో కూడా ప్రవేశిస్తుంది. సంవత్సరానికి రెండుసార్లు అంతరిక్ష నౌక భూమి వెనుక రోజుకు 72 నిమిషాల వరకు ఉండిపోతుంది.
అంతే అందంగా.. వేడిగా..
ఇన్‌స్టాగ్రామ్‌లో నాసా పోస్ట్‌కు 9 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఒక వినియోగదారుడు.. 4.5 బిలియన్ సంవత్సరాల తర్వాత ఇంకా వేడిగా ఉంది, అంతే అందంగా ఉంది, దాని రహస్యం ఏమిటి?!" అని కామెంట్ చేశాడు.మరో వినియోగదారుడు.. జేమ్స్ వెబ్ ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచాడు, మొత్తం విశ్వానికి సూర్యుడి అందాన్ని తీసుకువచ్చాడు, మీరు జేమ్స్ వెబ్ క్రియేటర్ చేతులను ముద్దాడాలి, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 అని కామెంట్ పెట్టాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.