పదేళ్లలో యుగాంతం?... భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం

యుగాంతంపై ఇప్పటికే చాలా డేట్లు వచ్చాయి. 2012లోనే ప్రపంచం అంతమైపోతుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు 2029లో యుగాంతం తప్పదనే వాదన వినిపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 6:56 AM IST
పదేళ్లలో యుగాంతం?... భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ విశ్వంలో మన భూమి స్పెషల్. దీనిపై జీవం ఆవిర్భవించింది. మిగతా గ్రహాల్లా కాకుండా... భూమిపై నీరు, గాలి ఉండటం వల్ల ఇక్కడ మనం జీవించగలుగుతున్నాం. ఐతే... మనం ఉన్న ఈ విశ్వం ఎంత విశాలమైనతో అంత ప్రమాదకరమైనది కూడా... ముఖ్యంగా గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కల వంటివి భూమికి శాపాలుగా ఉన్నాయి. అవి ఎప్పుడు భూమివైపు దూసుకొస్తాయో, ఎప్పుడు భూమిని ఢీకొంటాయో చెప్పలేం. ఇప్పటికే చాలా గ్రహశకలాలు భూమివైపు వచ్చి వెళ్లాయి. తాజాగా మరో భారీ గ్రహశకలం అపోఫిస్ (Apophis) భూమివైపు వస్తోంది. అది సరిగ్గా 2019లో ఏప్రిల్ 13న భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని స్వయంగా శాస్త్రవేత్తలే చెబుతున్నారు. పైగా దానికి గాడ్ ఆఫ్ చావోస్ అనే ఈజిఫ్ట్ దేవుడి పేరు పెట్టారు. అది ఢీకొంటే భూమి ముక్కలవడం ఖాయం.

గ్రహశకలం మొత్తం 1100 అడుగుల పొడవు (335 మీటర్ల పొడవు) ఉంది. అది గానీ భూమిని ఢీకొడితే... 15వేల అణుబాంబుల శక్తి విడుదలవుతుంది. ఒక్క అణుబాంబుకే ఓ రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టుకుపోగలదు. అలాంటిది 15వేల అణుబాంబులంటే మాటలా... భూమి మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి. ఐతే... ఆ ఆస్ట్రరాయిడ్ భూమిని ఢీకొట్టదని కూడా చెప్పే శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాళ్లు చెబుతున్నారు. ఎందుకంటే... ఆ గ్రహశకలం భూమికి 37,599 కిలోమీటర్ల దూరం నుంచీ వెళ్తుందని చెబుతున్నారు.

ఏది ఏమైనా 2029లో ఆ గ్రహశకలం మనకు కనిపిస్తుంది. అది అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మాత్రం ఆ గ్రహశకలం ఢీకొట్టే అవకాశాలు ప్రస్తుతానికి లేవని అంటోంది. ఐతే... అది వచ్చే రూట్‌ని కచ్చితంగా అంచనా వెయ్యలేమని అంటున్నారు శాస్త్రవేత్తలు. మరో పదేళ్లలో ఏం జరుగుతుందన్నది ఇప్పటి నుంచే ఆందోళన కలిగిస్తున్న అంశం.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు