NASA : మార్స్‌ గ్రహంపై నాసాకు నచ్చిన "రాయి"... ఎందుకంటే...

NASA Mars : మార్స్‌పై పరిశోధనలు చేస్తున్న ఇన్‌సైట్ ల్యాండర్... ఓ రాయి ఫొటో తీసి... నాసాకు పంపింది. ఇప్పుడా రాయిపై సైంటిస్టుల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 11:17 AM IST
NASA : మార్స్‌ గ్రహంపై నాసాకు నచ్చిన
మార్స్‌పై కదిలిన రాయి (Image : Twitter - Curiosity Rover)
Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 11:17 AM IST
NASA Insight Space Craft : మీకు తెలుసు. మార్స్‌పై తిరుగుతున్న క్యూరియోసిటీ రోవర్... ఇప్పటివరకూ కొన్ని వేల ఫొటోలను... అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ - నాసాకు పంపింది. ఆ ఫొటోలన్నింటినీ కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు రోజూ పరిశోధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే... మనం భవిష్యత్తులో జీవించబోయే గ్రహంగా అంగారక గ్రహాన్ని భావిస్తుండటమే. ఐతే... ఆమధ్య మార్స్‌పై దిగిన ఇన్‌సైట్ రోవర్ ఓ ఫొటోను పంపింది. అందులో ప్రత్యేకత ఏమీ లేదుగానీ... చుట్టూ మట్టి ఉండగా... మధ్యలో ఓ రాయి ఉంది. ఆ రాయి గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే... ఇప్పటివరకూ క్యూరియోసిటీ పంపిన ఫొటోల్లో... ఏ రాయీ... కదిలిన అనవాళ్లు లేవు. ఇన్‌సైట్ ల్యాండర్ పంపిన ఈ రాయి మాత్రం... ఇసుకలో దొర్లుతూ... ముందుకి వెళ్లినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. అందుకే దీన్ని రోలింగ్ (దొర్లే) స్టోన్‌ అని నాసా ముద్దుగా పిలుస్తోంది.

mars,nasa,insight,nasa insight,mars insight,nasa mars insight,nasa insight mars lander,insight mars,mars landing,nasa insight mars lander in hindi,insight lander,insight landing on mars,nasa mars mission,nasa mars,nasa insight launch,nasa insight lander,nasa insight landing,nasa insight mission,nasa mars insight rover,nasa insight mars,insight landing,nasa insight lands on mars,nasa live,నాసా, మార్స్, ఇన్ సైట్, రోలింగ్ స్టోరీ, రాయి, వింత ఫొటో,
(Image : mars.nasa.gov/resources/24628/rolling-stones-rock/?site=insight)




నాసాకి చెందిన ఇన్‌సైట్ స్పేస్ క్రాఫ్ట్... 2018 నవంబర్ 26న మార్స్‌పై దిగింది. గోల్ఫ్ బాల్ కంటే కాస్త పెద్దగా... అంటే... 5న్నర సెంటీమీటర్ల పరిమాణంలో ఉంది ఈ రాయి. 2.4 సెంటీమీటర్ల ఎత్తు ఉంది.




ఇంత పెద్ద రాయి కదలడమంటే మాటలు కాదు. బలమైన గాలులు వస్తే తప్ప కదిలే అవకాశం ఉండదు. కానీ ఈ రాయి కదిలినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టీ... మార్స్‌పై అత్యంత బలమైన గాలులు వీస్తున్నట్లు స్పష్టమైంది.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...