Narendra Modi: అమెరికాలో అగ్రనేతలకు మోదీ అందించిన బహుమతులు ఇవే.. ఏమేం ఉన్నాయంటే..

బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi US Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌ను కూడా కలిశారు. అంతేకాదు, మోరిసన్‌కు సిల్వర్ గులాబీ మీనకారి షిప్(Silver Gulabi Meenakari Ship) ను బహుమతిగా ఇచ్చారు.

  • Share this:
ప్రస్తుతం అమెరికా (America)లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అగ్ర నేతలను కలుస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ (Kamala Harris) తో భేటీ అయ్యి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం.. కమలా హారిస్‌కి భారత దేశం నుంచి తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్స్ అందజేశారు మోదీ. హారిస్‌కి తాతయ్య పీవీ గోపాలన్‌కు సంబంధించిన పాత నోటిఫికేషన్‌ల కాపీని చెక్క హస్తకళ రూపేణా బహుకరించారు. పీవీ గోపాలన్ వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ ప్రభుత్వ అధికారి అనే విషయం తెలిసిందే.

హరీస్‌కి తన తాతయ్యకు సంబంధించిన నోటిఫికేషన్లను హస్తకళా వస్తువులలో అందజేసి సర్ ప్రైజ్ చేసిన మోదీ.. మీనాకారీ చెస్ సెట్‌ను కూడా బహుమతిగా ఇచ్చారు. ఈ చెస్ సెట్‌లోని ప్రకాశవంతమైన రంగులు భారతదేశంలోని కాశీ హస్తకళలను ప్రతిబింభించాయి. ఈ స్పెషల్ చెస్ సెట్‌లోని ప్రతి భాగాన్ని చేతులతో అత్యద్భుతంగా తయారు చేయడం విశేషం. ఈ చదరంగం సెట్ రూపకల్పన ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరాల్లో ఒకటైన కాశీ హస్తకళలకు దగ్గరగా ఉంటుంది. వైట్ హౌస్ లో అనేక అంశాలపై చర్చించిన మోదీ, కమలా అమెరికా-ఇండియా (US-India relations) సంబంధాలు బలపరుస్తూ జాయింట్ స్టేట్మెంట్ జారీ చేశారు.

Amit Shah: సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడ్డాక జరగనున్న మెగా సదస్సుకు కేంద్ర మంత్రి అమిత్ షా

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా (Australia) ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌ (scott morrison)ను కూడా కలిశారు. అంతేకాదు, మోరిసన్‌కు సిల్వర్ గులాబీ మీనకారి షిప్(Silver Gulabi Meenakari Ship) ను బహుమతిగా ఇచ్చారు. ఈ షిప్ ను కాశీ హస్తకళలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా తయారు చేశారని మోదీ మోరిసన్‌కు వివరించారు.

అసెంబ్లీలో సీరియస్ ఇష్యూ‌పై మాట్లాడుతుండగా జారిన మాజీ సీఎం సిద్దరామయ్య

జపాన్ (Japan) ప్రధాన మంత్రి యోషిహిడే సుగా (Yoshinde SUga)కు గంధపు బుద్ధ విగ్రహాన్ని బహుకరించారు మోదీ. భారత్, జపాన్‌ మధ్య సత్సంబంధాలు ఏర్పడటంలో బౌద్ధమతం కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పారు. బుద్ధుడి ఆలోచనలు, తత్వాలు జపాన్‌లో చాలా దూరం ప్రతిధ్వనిస్తాయి. గతంలో జపాన్‌లో పర్యటించినప్పుడు, మోదీ బౌద్ధ దేవాలయాలను కూడా సందర్శించారు.

Covid ex gratia: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు..ఎలా పొందాలో తెలుసుకోండి


గురువారం ప్రధాని నరేంద్ర మోదీ క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటామిక్స్, బ్లాక్‌స్టోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో డ్రోన్‌ల, 5జీ, సెమీకండక్టర్, సౌర విద్యుత్ తదితర అనేక సమస్యలపై చర్చించారు. భారతదేశంలోని విస్తారమైన అవకాశాలను తెలియజేసి పెట్టుబడులను పెంచడానికి మోదీ వారిని ప్రోత్సహించారు.
Published by:Shiva Kumar Addula
First published: