PM Modi UNGA Speech Updates: నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ సంస్కృతి: ప్రధాని మోదీ

Narendra Modi UNGA Speech LIVE Updates: ఐక్యరాజ్య సమితి 74 జనరల్ అసెంబ్లీనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై యావత్ ప్రపంచం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: September 27, 2019, 9:21 PM IST
PM Modi UNGA Speech Updates: నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ సంస్కృతి: ప్రధాని మోదీ
Video : నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ సంస్కృతి : ప్రధాని మోదీ
  • Share this:
నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ సంస్కృతిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని స్మరించుకుంటూ  ఐక్యరాజ్యసమితి 74వ జనరల్ అసెంబ్లీలో ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. 2022నాటికి పేదల కోసం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధిగా పేర్కొన్న ప్రధాని మోదీ...ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 130 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకుని పథకాలను చేపడుతున్నట్లు చెప్పారు.

ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధించే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. దీని కోసం భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సంక్షేమం తమ నినాదమన్నారు.

modi un speech Live,modi unga speech live,modi un speech 2019 live,modi unga address live,modi un speech time live,unga modi live,మోదీ ప్రసంగం లైవ్,మోదీ స్పీచ్ లైవ్,ఐరాసలో మోదీ స్పీచ్ లైవ్,un general assembly 2019, modi speech in un 2019, pak media on modi, modi un speech, modi unga address,
ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ప్రసంగం.


గ్లోబల్ వార్మింగ్‌కు భారత్ కారణంకాకున్నా...ఈ  సమస్య పరిష్కారం కోసం భారత్ తీవ్రంగా కృషిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2025నాటికి టీబీ రహిత దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఉగ్రవాదం యావత్ మానవాళికి ప్రమాదకారిగా ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఐరాస మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు.

స్వచ్ఛ భారత్ గురించి తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఐదు మాసాల్లో దిగ్విజయంగా చేపట్టగలిగినట్లు వివరించారు. ఇందులో భాగంగా దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు వివరించారు.

First published: September 27, 2019, 7:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading