హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Modi phone to Putin:ఖార్కివ్‌లో మావాళ్లంతా సేఫ్‌గా ఉండేలా చూడండి..పుతిన్‌కి ఫోన్‌చేసి కోరిన మోదీ

Modi phone to Putin:ఖార్కివ్‌లో మావాళ్లంతా సేఫ్‌గా ఉండేలా చూడండి..పుతిన్‌కి ఫోన్‌చేసి కోరిన మోదీ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Modi phone to Putin: ఉక్రెయిన్‌, రష్యా యుద్దవాతావరణంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధుల క్షేమంపై ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ఫోన్ చేశారు. ఖార్కివ్‌లో చిక్కుకుపోయిన భారతీయులకు సురక్షిత మార్గం కల్పించాలని కోరారు. ఖార్కివ్‌ని రష్యా స్వాధీనం చేసుకునే ముందు 6గంటల పాటు వెసులుబాటు కల్పిస్తూ డెడ్‌లైన్ విధించినట్లుగా సమాచారం.

ఇంకా చదవండి ...

ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రష్యా (Russia )అధ్యక్షుడు (President) వ్లాదిమిర్ పుతిన్‌( Putin) తో మరోసారి ఫోన్‌(phone)లో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో పాటు ఖార్కివ్‌(Kharkiv)లో చిక్కుకుపోయిన చాలా మంది భారతీయుల(indians) పరిస్థితి గురించి మోదీ ఆరా తీశారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న సంఘర్షణల ప్రాంతం నుంచి విద్యార్ధుల్ని సురక్షిత మార్గం కల్పించాలని మోదీ పుతిన్‌ని కోరారు. ఈఅంశంపై ఇద్దరి మధ్య సానుకూల చర్చలు జరిగాయి.  ప్రస్తుతానికి రష్యా ఆధీనంలో ఉన్నఖార్కివ్‌లో చిక్కుకున్న భారతీయలను అవసరమైన అన్ని సూచనలు జారీ చేయబడిందని పుతిన్ మోదీతో జరిపిన ఫోన్‌ కాల్‌లో చెప్పినట్లుగా అక్కడి మీడియా వెల్లడించింది.యుద్ధ ప్రాంతం నుండి భారతీయ పౌరులను సురక్షితంగా వారి స్వదేశానికి పంపించేందుకు  రష్యా సైన్యం సాధ్యమైన వరకు సహాయం చేస్తుందని పుతిన్ వెల్లడించారు. భారత ప్రధాని అభ్యర్ధనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రష్యా ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు ఆరు గంటల పాటు వెసులుబాటు కల్పించారు. రష్యా విధించిన డెడ్‌లైన్ (Deadline)మన టైమ్‌ ప్రకారం బుధవారం(Wednesday) రాత్రి 9.30గంటలు ఉండగా ఉక్రెయిన్‌ టైమ్‌ ప్రకారం సాయంత్రం 6గంటలతో డెడ్‌లైన్ ముగుస్తుంది. ఈలోపే ఖార్కివ్‌లో ఉన్న భారతీయులు అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవల్సిందిగా ఇండియన్ ఎంబసీ(Indian Embassy)అప్రమత్తం చేసింది. ఆ ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆరు గంటల పాటు కల్పించిన సేఫ్ ప్యాకేజీని ఉపయోగించుకోవాలని రష్యా సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఖార్కివ్‌ని చేజిక్కించుకునేందుకు ఏమాత్రం ఆలస్యం చేయబోమని ఓ ప్రకటనలో తేల్చి చెప్పింది.

పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ..

మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న బాంబు దాడుల్లో మరో భారతీయుడు కన్నుమూశాడు. కర్నాటకకు చెందిన నవీన్‌ మరణవార్త నుంచి తేరుకోక ముందే మరో భారతీయ విద్యార్ది అనారోగ్యంతో ఉక్రెయిన్‌లో ప్రాణాలు విడిచినట్లుగా జాతీయ మీడియా వెల్లడించింది. పంజాబ్‌లోని బర్నాలా ప్రాంతానికి ెచందిన చందన్‌ జిందాల్‌ ఉక్రెయిన్‌లోని విన్నీసియాలో మోమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఫిబ్రవరి 2న చందన్‌ అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో ఆపరేషన్ కూడా చేశారు. బిడ్డను చూసేందుకు గత నెల 7వ తేదిన జిందాల్‌ పేరెంట్స్‌ ఉక్రెయిన్‌ వెళ్లారు. భారతీయ విద్యార్ది ఆరోగ్యం మంగళవారం రాత్రి విషమించడంతో మృతి చెందాడు. జిందాల్ మృతికి ముందే ఖార్కివ్‌లో రష్యా జరిపిన ఫిరంగి దాడిలోనే కర్నాటక స్టూడెంట్ నవీన్ మృతి చెందినట్లుగా అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.

భారతీయ విద్యార్దుల క్షేమంపై ఆరా..

ఉక్రెయిన్‌లోనే రెండో అతిపెద్ద నగరంగా ఉన్న ఖార్కివ్‌లో భారతీయులు 30మంది బంకర్‌లో తలదాచుకున్నారు. ఆహార పదార్ధాల కోసం నవీన్ బయటకు వచ్చిన సమయంలోనే ఫిరంగి దాడిలో చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్ది మృతిపై రష్యా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విద్యార్ది కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా ప్రకటించింది.

First published:

Tags: Narendra modi, Russia-Ukraine War, Vladimir Putin

ఉత్తమ కథలు