• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • NAMASTE GOES GLOBAL EMMANUEL MACRON ANGELA MERKEL GREET EACH OTHER WITH NAMASTE VIDEO GOES VIRAL

‘నమస్తే’తో ఫ్రాన్స్, జర్మనీ దేశాగ్రనేతలు పలకరింపు..వైరల్ వీడియో | Watch

ప్రపంచ నేతల నమస్తే పలకరింపు

Namaste Goes Global: షేక్ హ్యాండ్‌తో పలకరించుకోవడం కంటే...భౌతిక దూరం పాటిస్తూ భారత సాంప్రదాయంలో ‘నమస్తే’తో పలకరించుకునేందుకే ఇప్పుడు ప్రపంచ నేతలు కూడా మొగ్గుచూపుతున్నారు.

  • Share this:
    కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా మార్పులు తీసుకొస్తోంది. ఆత్మీయ ఆలింగనలు, షేక్ హ్యాండ్స్ బంద్ అయ్యాయి. షేక్ హ్యాండ్‌తో పలకరించుకోవడం కంటే...భౌతిక దూరం పాటిస్తూ భారత సాంప్రదాయంలో ‘నమస్తే’తో పలకరించుకునేందుకే ఇప్పుడు ప్రపంచ నేతలు కూడా మొగ్గుచూపుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్‌.. షేక్ మ్యాండ్‌కు బదులుగా ఇండియన్ స్టయిల్‌లో నమస్తేతో పలకరించుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ...నమస్తే అంటూ పరస్పరం గ్రీట్ చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ట్రావెల్ ఆంక్షలపై చర్చించేందుకు ఈ ఐరోపా దేశాల అగ్ర నేతలు గురువారం సమావేశమయ్యారు. రెండు చేతులు జోడించి నమస్తేతో ఏంజెలా మెర్కల్‌కు మాక్రన్ స్వాగతం పలకగా...ఆమె కూడా నమస్తే చెబుతూ ఆయనకు ప్రతినమస్కారం చేశారు.

    నమస్తే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందుతోందంటూ ఈ వీడియోను ఆల్ ఇండియా రేడియో ట్వీట్ చేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ నమస్తేతో పలకరించుకున్నారని పేర్కొంది.



    కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని వైద్య నిపుణుల నొక్కి చెబుతున్నారు. ఆలింగనలు, షేక్ హ్యాండ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరంతో కూడిన భారత సాంప్రదాయ ‘నమస్తే’ పలకరింపు ప్రపంచ వ్యాప్తంగా ప్రచుర్యం పొందుతోంది.
    Published by:Janardhan V
    First published: