హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Belgian F2000 Rifles: బెల్జియన్ F2000 రైఫిల్స్‌తో కనిపించిన ఉక్రెయిన్ సైనికులు.. F2000 రైఫిల్స్‌ అంటే ఏమిటి..?

Belgian F2000 Rifles: బెల్జియన్ F2000 రైఫిల్స్‌తో కనిపించిన ఉక్రెయిన్ సైనికులు.. F2000 రైఫిల్స్‌ అంటే ఏమిటి..?

బెల్జియమ్ రైఫిల్స్ తో ఉక్రెయిన్ సైనికుడు

బెల్జియమ్ రైఫిల్స్ తో ఉక్రెయిన్ సైనికుడు

బెల్జియన్ F2000 రైఫిల్స్‌తో కనిపిస్తున్న ఉక్రెయిన్‌ సైనికుల రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఉక్రెయిన్‌కు ఏ దేశమూ అధికారికంగా F2000 రైఫిల్స్‌ అందజేయనందున.. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై ఊహాగానాలు అందుకున్నాయి.

బెల్జియన్(Belgian) F2000 రైఫిల్స్‌తో కనిపిస్తున్న ఉక్రెయిన్‌(Ukraine) సైనికుల రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌(Viral) గా మారాయి. ఉక్రెయిన్‌కు ఏ దేశమూ అధికారికంగా F2000 రైఫిల్స్‌(Rifles) అందజేయనందున.. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై ఊహాగానాలు అందుకున్నాయి. ఒక ఫోటోలో నాన్‌డిస్క్రిప్ట్(Non Descript) యూనిఫాంలో ఉన్న ఉక్రెయిన్‌(Ukraine) సైనికుడి చేతిలో కనిపిస్తున్న ఆయుధం.. మరొక ఫోటోలు ముగ్గురు ఉక్రెయిన్‌ సైనికులలో ఇద్దరు పిక్ అప్ ట్రక్(Pick Up Track) ముందు పాలిమర్ తొడిగిన రైఫిల్స్‌తో కనిపిస్తున్నాయి.

F2000 రైఫిల్స్ అంటే ఏంటి?

మోడర్న్‌, మాడ్యులర్ అసాల్ట్ రైఫిల్ కోసం బెల్జియన్ కంపెనీ FN హెర్స్టాల్ F2000ను తయారు చేసింది. రైఫిల్‌లో కాంపాక్ట్ బుల్‌పప్ లేఅవుట్‌.. ఇందులో ట్రిగ్గర్‌ వెనుక యాక్షన్‌, ఛాంబర్‌ ఉంటాయి. రైఫిల్ పొడవు తక్కువగా ఉండటమే కాకుండా రెండు చేతులతోనూ సమర్థంగా పనిచేయగల వారికి బెస్ట్‌ ఆప్షన్‌ ఉంటుంది. శాంతి పరిరక్షణ కార్యకలాపాల కోసం టియర్ గ్యాస్ కాల్చడానికి వీలుగా M303 అండర్ బారెల్ మాడ్యూల్ ఉంటుంది. 40mm FN EGLM గ్రెనేడ్ లాంచర్లను అమర్చే అవకాశం ఉంటుంది. మరింత తీవ్రత కోసం కంప్యూటరైజ్డ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌ అమర్చే వీలు కూడా ఉంటుంది. ఉక్రెయిన్‌ సైనికులు తీసుకెళ్లే రైఫిల్స్‌లో ఈ యాడ్-ఆన్‌లు కనిపించలేదు.

శ్రీలంకలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలోపెరిగిన ఆయిల్ ధరలు..లీటర్ పెట్రోల్ రూ.420

ఉక్రెయిన్‌కు బెల్జియం రహస్యంగా F2000 రైఫిల్స్‌ను సరఫరా చేస్తుందా..?

ఉక్రెయిన్‌కు 5,000 FNC-రకం అసాల్ట్ రైఫిల్స్, 200 యాంటీ ట్యాంక్‌ వెపన్స్‌, 3,800 టన్నుల ఇంధనాన్ని విరాళంగా అందించినట్లు బెల్జియం ధ్రువీకరించింది. F2000, FNC రకం అసాల్ట్ రైఫిల్స్‌ను ఒకే కంపెనీ తయారు చేస్తోంది. అయినప్పటికీ SCAR-L డెలివరీల గురించి లేని అధికారిక ప్రస్తావన, చాలా తక్కువగా తరలించిన F2000 ఆయుధాలు. సోషల్ మీడియాలో SCAR-L, F2000 రైఫిల్స్‌తో ఉన్న ఉక్రెయిన్‌ సైనికుల ఫొటోలు కనిపించాయి.


Cancer killing Virus: క్యాన్సర్‌ వ్యాధిని తరిమికొట్టే కొత్త వైరస్.. ఇదే తొలిసారి..

ఉక్రెయిన్‌కు F2000 రైఫిల్స్‌ను ఎవరు సరఫరా చేశారు?

ఒరిజినల్‌ కాన్ఫిగరేషన్‌లోని F2000 మోడల్స్‌గా రైఫిల్స్ కనిపిస్తున్నాయి. ఇటీవలే రైఫిల్స్‌ను కొత్తగా మార్చడంతో రైఫిల్స్‌ను సరఫరా చేయగల దేశాల జాబితా నుంచి స్లోవేనియా తొలగించబడింది. రైఫిల్స్‌ను కొంత మేరకు ఉపయోగించిన పోలాండ్, స్పెయిన్‌, వాటిని డెలివరీకి వీలుగా దేశాలు మార్చాయి. మిడిల్‌ఈస్ట్‌, ఆసియాలో ఉన్న F2000s మిగిలిన కొనుగోలుదారులు, అవి ఉక్రెయిన్‌కు ఆయుధాలను విరాళంగా ఇవ్వలేదు. స్వచ్ఛంద దళాలను సన్నద్ధం చేయడానికి ప్రైవేట్‌గా నిధులు సమకూర్చి ఆయుధాలను కొనుగోలు చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌ సొంతం కాని తుపాకీల జాబితాలో F2000 రైఫిల్స్ చేరాయి. యుద్ధానికి ముందు అనేక రకాల తుపాకీలను ఉపయోగిస్తూ ఉక్రెయిన్ వాలంటీర్ ప్రాదేశిక రక్షణ దళాల సభ్యులు కనిపించారు. యుద్ధభూమిలో పోలాండ్ గ్రోట్ C16A2 అసాల్ట్ రైఫిల్స్ తర్వాత F2000 కనిపించాయి.

First published:

Tags: Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు