హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Mystery Deaths: ఇటు ఉక్రెయిన్ పై యుద్ధం.. అటు మధ్య రష్యాలోని ప్రముఖుల ఆత్మహత్యలు.. ఏంటి ఈ మిస్టరీ..

Mystery Deaths: ఇటు ఉక్రెయిన్ పై యుద్ధం.. అటు మధ్య రష్యాలోని ప్రముఖుల ఆత్మహత్యలు.. ఏంటి ఈ మిస్టరీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏడాది జనవరి నుంచి ఆరుగురు రష్యన్ ఒలిగార్చ్‌లు ఆత్మహత్య చేసుకొన్నట్లు నివేదికలు గుర్తించగా.. హైకింగ్ యాక్సిడెంట్‌లో మరొకరి మృతి చెందారు. రష్యా ఎనర్జీ సెక్టార్‌కు చెందిన ప్రముఖులే ఎక్కువగా మృతి చెందడం మిస్టరీగా మారింది.

ఈ ఏడాది జనవరి నుంచి ఆరుగురు రష్యన్ (Russian) ఒలిగార్చ్‌లు ఆత్మహత్య చేసుకొన్నట్లు నివేదికలు గుర్తించగా.. హైకింగ్ యాక్సిడెంట్‌లో(Accident) మరొకరి మృతి చెందారు. రష్యా ఎనర్జీ సెక్టార్‌కు(Sector) చెందిన ప్రముఖులే ఎక్కువగా మృతి చెందడం మిస్టరీగా(Mystery) మారింది. రష్యన్ ఒలిగార్చ్‌ల మిస్టరీ డెత్స్(Deaths) వివరాల్లోకి వెళ్తే.. మే 2న ఆండ్రీ క్రుకోవ్స్కీ, ఏప్రిల్ 19 సెర్గీ ప్రోటోసేన్యా, ఏప్రిల్ 18 వ్లాడిస్లావ్ అవయేవ్, మార్చి 23 వాసిలీ మెల్నికోవ్, ఫిబ్రవరి 28 మిఖాయిల్ వాట్‌ఫోర్డ్, ఫిబ్రవరి 25 అలెగ్జాండర్ త్యూల్యకోవ్, జనవరి 30 న లియోనిడ్ షుల్మాన్ లు చనిపోయారు. స్పెయిన్‌లోని ఒక విలాసవంతమైన విల్లాలో ఉరివేసుకుని కనిపించిన ప్రొటోసెన్యా, అతను కుటుంబంతో విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. ప్రోటోసెన్యా భార్య, కుమార్తె కూడా కత్తిపోట్లతో చనిపోయినట్లు స్పానిష్ పోలీసులు తెలిపారు. స్పానిష్ మీడియా సంస్థలు టెలిసింకో, ఎల్ పంట్ అవూయి ప్రకారం ప్రోటోసెన్యా మృతదేహం పక్కన గొడ్డలి, కత్తి కనిపించినట్లు తెలిపారు.

Russia Victory Day: విక్టరీ డే ప్రదర్శనలో కనిపించిన పుతిన్‌ డెడ్లీ వెపన్స్‌.. వాటి సామర్థ్యాల వివరాలిలా..


రష్యన్ ఒలిగార్చ్ తన భార్య, కుమార్తెను చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంగా అనుమానాలు వ్యక్తం చేసిన టెలిసింకో. తన తండ్రి కుటుంబానికి ఎప్పటికీ హాని చేయడని డైలీ మెయిల్‌ మీడియా సంస్థతో ప్రోటోసెన్యా కుమారుడు ఫెడోర్ చెప్పాడు. తన తల్లిని, ముఖ్యంగా తన సోదరి మరియాను తండ్రి ఎంతగానే ప్రేమించారన్న ఫెడోర్‌ అన్నారు. వారికి హాని కలిగించేలా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు, ఆ రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మా నాన్న వాళ్లను బాధపెట్టలేదని మాత్రం తెలుసన్న ప్రోటోసెన్యా కుమారుడు అన్నాడు.

ప్రోటోసెన్యా సూసైడ్ నోట్‌ రాయలేదని, అక్కడున్న ఆయుధాలపై ఎలాంటి వేలిముద్రలు కూడా కనిపించలేదని రిపోర్ట్స్‌ తేల్చాయి. హత్య- ఆత్మహత్య థియరీని ప్రోటోసెన్యా మాజీ యజమానులు, రష్యన్ సహజ వాయువు ప్రధాన సంస్థ నోవాటెక్ ప్రశ్నించాయి. సెర్గీ ప్రోటోసెన్యా అత్యుత్తమ వ్యక్తి, కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు, సంస్థ ఏర్పాటు, అభివృద్ధికి గణనీయమైన సహకారం అందించారని నోవాటెక్‌ ప్రకటించాడు. దురదృష్టవశాత్తు ఆయన మృతిపై వివిధ ఊహాగానాలు మీడియాలో వెలువడ్డాయి, ఊహాగానాలకు వాస్తవానికి సంబంధం లేదని నమ్ముతున్నామని నోవాటెక్‌ అన్నారు.

ఫౌల్ ప్లే లేదా హత్య- ఆత్మహత్య..?

మాస్కోలోని అపార్ట్‌మెంట్‌లో భార్య, కుమార్తెతో కలిసి శవంగా కనిపించిన రష్యన్ ఎనర్జీ సెక్టార్‌ దిగ్గజ సంస్థ గాజ్‌ప్రోమ్‌బ్యాంక్ మాజీ వైప్‌ ప్రెసిడెంట్‌ అవయేవ్. అవాయెవ్ తన భార్య, కుమార్తెను చంపిన తర్వాత పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు భావిస్తున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది. అవయేవ్ తనను తాను చంపుకున్నాడని తాను నమ్మడం లేదని CNNతో గాజ్‌ప్రోమ్‌బ్యాంక్ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇగోర్ వోలోబువ్ చెప్పాడు. ప్రైవేట్ బ్యాంకింగ్‌తో వ్యవహరించడం అతని పని, వీఐపీ ఖాతాదారులతో పనిచేస్తారు, అతను పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించాడని ఇగర్‌ వోలోబువ్‌ చెప్పాడు.

అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోడని, అతనికి ఏదో తెలిసి ఉంటుందని, అదే మరణానికి కారణం అయి ఉంటుందని ఇగోర్ అనుమానం వ్యక్తం చేశారు. రష్యాలోని నిజ్నీ నొవ్‌గోరోడ్‌లోని అపార్ట్‌మెంట్‌లో తన భార్య, ఇద్దరు కుమారులతో శవమై మెల్నికోవ్ కనిపించారు. మెడికల్ ఎక్విప్‌మెంట్ సప్లై కంపెనీ యజమాని అయిన మెల్నికోవ్ తన కుటుంబాన్ని హత్య చేసి, ఆత్మహత్య చేసుకొన్నాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Snooze at work : ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్..మధ్య్నాహం ఓ అరగంట హాయిగా నిద్రపోవచ్చు

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఇతర అనుమానాస్పద మరణాలు..

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు జనవరి చివరలో గాజ్‌ప్రోమ్‌లో ఉన్నత స్థాయి మేనేజర్ అయిన షుల్‌మాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన మరుసటి రోజు, సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటిలో గాజ్‌ప్రోమ్ మాజీ ఎగ్జిక్యూటివ్ త్యుల్యకోవ్ ఉరివేసుకొని కనిపించాడు. ఇంగ్లాండ్‌లోని తన కంట్రీ ఎస్టేట్‌లో ఉక్రెయిన్‌లో జన్మించిన గ్యాస్, ఆయిల్ రంగానికి చెందిన ప్రముఖుడు మిఖాయిల్ వాట్‌ఫోర్డ్ ఉరివేసుకొని చనిపోయాడు. హైకింగ్ సమయంలో కొండపై నుండి పడి స్కీ రిసార్ట్ క్రాస్నాయా పాలియానా డైరెక్టర్ ఆండ్రీ క్రుకోవ్స్కీ మరణించాడు.

విమర్శకులను సైలెంట్‌ చేయడంలో పుతిన్‌పై ఆరోపణలు..

చాలా కాలంగా ప్రత్యర్థులపై హత్యాప్రయత్నాల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు అధ్యక్షుడు పుతిన్, క్రెమ్లిన్‌. ఆగస్ట్ 2020లో పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవల్నీ టామ్స్క్‌పై విమానాశ్రయంలో ఉండగా నోవిచోక్ నెర్వ్ ఏజెంట్‌ ద్వారా విషప్రయోగం జరిగింది. 2018లో రష్యా GRU ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధిపతి సెర్గీ స్క్రిపాల్‌పై కూడా ఇదే తరహా విషప్రయోగం జరిగింది. నావల్నీ, స్క్రిపాల్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడగా, రష్యా మాజీ భద్రతా అధికారి అలెగ్జాండర్ లిట్వినెంకోపై తీవ్ర విషప్రయోగం జరిగింది. లిట్వినెంకో UKకి తరలిపోయినందుకు లండన్‌లో రేడియోధార్మిక పొలోనియం ద్వారా విషప్రయోగం జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.


China Loans To Sri Lanka : బుద్ధి తెచ్చుకోని లంక..మరిన్ని రుణాలతో శ్రీలంకను మళ్లీ ట్రాప్ చేస్తోన్న చైనా

మూడేళ్లలో కనీసం 38 మంది ఒలిగార్చ్‌లు మరణించినట్లు లేదా అదృశ్యమైనట్లు 2017లో USA టుడే వార్తాపత్రిక కథనం వెలువడిచింది. మరణించిన ఏడుగురు ఒలిగార్చ్‌లలో ఎవరూ పుతిన్ లేదా ఉక్రెయిన్‌పై రష్యా దాడిని బహిరంగంగా విమర్శించినట్లు ఎక్కడా కనిపించలేదు. మార్చిలో పాశ్చాత్య అనుకూల ఒలిగార్చ్‌లపై పుతిన్ విరుచుకుపడ్డాడు. వారు మానసికంగా అక్కడ ఉన్నారు కానీ ఇక్కడ కాదని.. ప్రజలతో, రష్యాతో లేరని పుతిన్‌ వ్యాఖ్యానించాడు.

First published:

Tags: Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు