చైనా నుంచి అనుమానాస్పద విత్తన పార్సిల్స్.. ఏం జరుగుతోంది?

ఈ పార్సిల్స్‌తో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు కూడా భయపడిపోతున్నాయి. అసలు వీటిని ఎవరు పంపిస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? ఆ విత్తనాలు ఏంటన్న దానిపై అమెరికా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

news18-telugu
Updated: July 31, 2020, 10:47 AM IST
చైనా నుంచి అనుమానాస్పద విత్తన పార్సిల్స్.. ఏం జరుగుతోంది?
చైనా నుంచి అనుమానాస్పద విత్తనాల పార్సిల్స్.. అమెరికాలో తీవ్ర కలకలం
  • Share this:
అమెరికాలో తీవ్ర కలకలం రేగింది. చైనా నుంచి అనేక మంది అమెరికన్లకు అనుమానాస్పద ప్యాకెట్లు వస్తున్నాయి. విప్పి చూస్తే అందులో విత్తనాలు కనిపించాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలా మందికి ఇప్పటికే ఇలాంటి పార్సిల్స్ డెలివరీ అయ్యాయి. వాటిలో రకరకాల విత్తనాలు ఉన్నాయి. చైనీస్ పోస్ట్ సర్వీస్ కంపెనీ చైనా పోస్ట్ ద్వారా ఈ అనుమానస్పద ప్యాకెట్లు వస్తున్నాయి. చాలా ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూడడంతో అమెరికా వ్యవసాయ శాఖ (USDA) అప్రమత్తమైంది. ఆ విత్తనాలను నాటవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఎవరికైనా ఇలాంటి ప్యాకెట్లు అందింతే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. ఒక్క అమెరికానే కాదు కెనడా, ఈయూ, యూకే, ఆస్ట్రేలియాలోనూ చాలా మందికి ఇలాంటి ప్యాకెట్లు వెళ్తున్నాయని USDA వెల్లడించింది.

ఐతే చైనాలోని జియాంగ్జు ప్రావిన్స్ సుజౌ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తున్నాయని.. వాటిపై ఉన్న అడ్రస్ ఆధారంగా తెలుస్తోంది. వీటిని పొరబాటున నాటితే వాతావరణ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పార్సిల్స్‌తో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు కూడా భయపడిపోతున్నాయి. అసలు వీటిని ఎవరు పంపిస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? ఆ విత్తనాలు ఏంటన్న దానిపై అమెరికా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: July 31, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading