• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • MYANMAR VIOLENCE AT LEAST 114 KILLED IN MYANMAR IN DEADLIEST DAY SINCE COUP SU

Myanmar Violence: మయన్మార్‌లో రక్తపాతం.. మిలటరీ క్రూరత్వం.. ఒక్కరోజే 114 మంది కాల్చివేత..

Myanmar Violence: మయన్మార్‌లో రక్తపాతం.. మిలటరీ క్రూరత్వం.. ఒక్కరోజే 114 మంది కాల్చివేత..

మయన్మార్‌లో రక్తపాతం(Image-Reuters)

మయన్మార్‌లో ఆందోళనకారులపై సైనిక దళాలు విరుచుకుపడ్డాయి. శనివారం సైనిక దళాలు జరిపిన కాల్పుల్లో 114 మంది మృతిచెందారు.

  • Share this:
    మయన్మార్‌లో నిరసనకారులపై మిలటరీ తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. అక్కడి వీధుల్లో రక్తం ఏరులుగా పారింది. మిలటరీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై బులెట్ల వర్షం కురిసింది. మయన్మార్ Armed Forces Day రోజునే సాయుధ బలగాలు ఈ విధంగా రెచ్చిపోయాయి. శనివారం ఒక్కరోజే మయన్మార్ వ్యాప్తంగా 114 మంది మిలటరీ కాల్పుల్లో చనిపోయినట్టు Myanmar Now పేర్కొంది. వందలాది మంది ప్రజలు గాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ మృతుల సంఖ్య మరింతగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా స్థానిక మీడియో పేర్కొంది. దేశంలోని 44 పట్టణాల్లో కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. మిలటరీ కాల్పుల్లో పలువురు చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు.

    ఇక, ఫిబ్రవరి 1న మయన్మార్‌‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి దేశంలో పాలన సాగిస్తుంది. అయితే సైనిక పాలనకు వ్యతిరేక దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నవారిని అదుపు చేసేందుకు సైన్యం.. హింసాత్మక చర్యలకు పాల్పడుతుంది. ఇప్పటివరకు 400 మంది పౌరులు మరణించారు. అయితే ఈ స్థాయిలో నిరసనకారులపై కాల్పులు జరగడం ఇదే తొలిసారి.

    ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డే రోజున మయన్మార్ రాజధాని న్యాపిటావ్ మిలటరీ భారీ కవాతు నిర్వహించింది. ఈ క్రమంలోనే సైన్యాధ్యక్షుడు జుంటా మాట్లాడుతూ.. నిరసనకారులకు గట్టి హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిరసనలను అణచివేసేందుకు.. సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపి.. మరణకాండ సృష్టించింది.

    మయన్మార్‌లో శనివారం చోటుచేసుకున్న పరిణామాలను ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఐకరాజ్య సమితో పాటుగా పలు దేశాలు మయన్మార్‌లో సైనిక చర్యలను ఖండించాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ మయన్మార్‌లో జరిగిన ఉచకోతను భయానక చర్యగా అభివర్ణించారు. కొందరి కోసం సైన్యం పౌరుల ప్రాణాలను పణంగా పెడుతోందని మండిపడ్డారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు