Home /News /international /

MYANMAR UPDATES AUNG SAN SUU KYI GETS 5 YEARS IN JAIL IN CORRUPTION CASE MKS

Aung San Suu Kyi: అవినీతి కేసులో ఆంగ్‌ సాన్‌ సూకీకి జైలు శిక్ష.. మయన్మార్ సైనిక సర్కారు ప్రతీకారం?

ఆంగ్‌ సాన్‌ సూకీ (పాత ఫొటో)

ఆంగ్‌ సాన్‌ సూకీ (పాత ఫొటో)

సైనిక పాలనలో ఉన్న మయన్మార్ లో మాజీ నాయకురాలు, హక్కుల కార్యకర్త, ఆంగ్‌ సాన్‌ సూకీ జైలుపాలయ్యారు. అవినీతి కేసులో మయన్మార్ కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది..

ఇండియాతో సరిహద్దు పంచుకునే మయన్మార్ దేశంలో మరో సంచలనం చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా అంతర్గత కలహాలుతో అట్టుడుకుతూ, ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న మయన్మార్ లో మాజీ నాయకురాలు, హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ జైలుపాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె అవినీతికి పాల్పడిందనే కేసులో మయన్మార్ కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది..

సైనిక పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ హక్కుల ఉద్యమం జరిపిన సూకీ ప్రజల మద్దతుతో 2016లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మళ్లీ ఐదేళ్లకే 2021లో సూకీని కూలదోసి మయన్మార్ సైన్యం తిరిగి పాలన చేపట్టడం తెలిసిందే. ప్రతీకార చర్యలా? అన్నట్లుగా ప్రస్తుత సైనిక ప్రభుత్వం.. సూకిపై 11 అవినీతి కేసులు మోపింది. ఈ కేసుల విచారణ ముగియగా, బుధవారం నాటి తీర్పులో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. సూకీ మాత్రం ఇప్పటికీ తనపై ఆరోపణలను ఖండిస్తూనే ఉంది. సైన్యం ప్రతీకార చర్యలో భాగంగానే సూకీపై తప్పుడు కేసులు మోపుతున్నారని ఆమె ఫాలోవర్లు అంటున్నారు.

KCR | TRS plenary: ఒక్కసారి కూడా బీజేపీ పేరెత్తని కేసీఆర్.. కారు గేరు మారిందా? పీకే వ్యూహమా?


సూకీ సుప్రీంనేతగా అధికారంలో ఉన్న కాలంలో 6 లక్షల డాలర్లను నగదు, 11.4 కిలోల బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు స్పష్టమైన ఆధారాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. దీంతో సూకీకి ఐదేళ్లపాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అయితే, సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు కావడం విశేషం. మిగిలిన 10 కేసుల్లో కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే.. ఆమె శిక్ష కాలం మరిత పెరగనుంది.

KCR | TRS plenary: కేసీఆర్ సంచలనం.. జాతీయ అజెండా ప్రకటన.. భారత రాష్ట్ర సమితి (BRS)!


నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ చైర్ పర‍్సన్‌గా ఉన్న ప్రజానేత ఆంగ్‌ సాన్‌ సూకీ.. 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆమె మయన్మార్‌లో సైనిక పాలన నిర్మూలన కోసం పోరాటం చేసింది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం ఆమె మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. సూకీ వయసు ప్రస్తుతం 76 ఏళ్లు.
Published by:Madhu Kota
First published:

Tags: International news, Myanmar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు