Myanmar Plane Crash: కుప్పకూలిన మిలటరీ విమానం.. 12 మంది దుర్మరణం

కుప్పకూలిన విమానం (Image:Twitter/WEEEKLY MYANMAR)

Myanmar Plane Crash: మయన్మార్‌లో ఘోర విమానం ప్రమాదం జరిగింది. మాండలే నగరంలో మిలటరీ విమానం కుప్పకూలి 12 మంది మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి.

  • Share this:
    భారత సరిహద్దు దేశం మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. విమాన పైలట్‌తో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మయన్మార్‌లో రెండో అతి పెద్ద నగరమైన మాండలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. మయన్మార్ మిలటరీ విమానం రాజధాని నేపిడా నుంచి పియన్‌వూ ల్విన్‌కు బయలుదేరింది. ఐతే ఏం జరిగిందో ఏమో గానీ.. ఆకాశంలో అదుపుతప్పిన విమానం, మాండలేలోని స్టీల్ ప్లాంట్‌ సమీపంలో కుప్పకూలింది. దాదాపు 984 ఫీట్ల ఎత్తు నుంచి కిందపడిపోయినట్లు మిలటరీ నేతృత్వంలోని మియవాడి టెలివిజన్ తెలిపింది. విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు పలువురు సాధువులు ఉన్నారు. వారంతా ఓ బుద్దిస్ట్ మఠానికి వెళ్లాల్సి ఉందని అంతలోనే ఈ ఘోర జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

    ఐతే విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గత రికార్డులను చూస్తే.. అక్కడ విమాన ప్రయాణం అంత సురక్షితమైనది కాదు. ఎన్నో ప్రమాదాలు జరిగాయి. మరోవైపు మయన్మార్‌లో కొన్ని రోజులుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఫిబ్రవరి 1న ఆంగ్‌సూన్ సూకీ ప్రభుత్వంపై మయన్మార్ సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి అక్కడ నిత్యం గొడవలు జరుగుతున్నాయి. మిలటరీ పాలనకు వ్యతిరేంకగా ఎవరైనా ఆందోళనలు చేస్తే అక్కడి సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. కాల్పుల్లో ఇప్పటి వరకు వందలాది పౌరులు మరణించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: