హోమ్ /వార్తలు /international /

Mynmar landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 100 మంది కూలీలు గల్లంతు

Mynmar landslide: మయన్మార్‌లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 100 మంది కూలీలు గల్లంతు

Myanmar Landslides: గత ఏడాది కూడా ఇదే ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జేడ్ మైన్‌లో కొండచరియలు విరిగిపడి 110 మందికి పైగా మరణించారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయాలతో బయటపడ్డారు

    మయన్మార్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రంగు రాళ్ల గని (Jade Mines)లో భారీగా కొండ చరియలు (Myanmar Landslides) విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఒకరి మృతదేహం లభ్యమయింది. మరో 100 మంది వరకు గల్లంతయ్యారు. 25 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాచిన్ ప్రావిన్స్‌లో చైనా సరిహద్దులో ఉన్న హ్కాపన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ జేడ్  (ఒక రకమైన రంగురాళ్లు) గనులు ఎక్కువగా ఉంటాయి. వాటికి చైనాలో భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో మయన్మార్‌లోని గనుల నుంచి కూలీల సాయంతో రంగురాళ్లను సేకరిస్తారు. వారికి తక్కువ డబ్బులు చెల్లించి.. వ్యాపారులు మాత్రం అధిక ధరకు చైనాకు అమ్ముుంటారు. తమకు వస్తుంది తక్కువ డబ్బులే అయినా.. జీవనోపాధి కోసం ప్రాణాలకు తెగించి రంగురాళ్ల సేకరణ కోసం కొండ ప్రాంత ప్రజలు వెళ్తుంటారు.

    North Korea: చిన్న తప్పుకే ఉరిశిక్ష.. ఆ వీడియోలు చూశారని చంపేశారు.. రాక్షస పాలన అంటే ఇదే

    ఐతే ఆ గనుల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతుంటాయి. తాజాగా మరోసారి మట్టి పెళ్లలు విరిగిపడడంతో వాటి కింద కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  దాదాపు 200 మందితో  రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.  సమీపంలో ఉన్న చెరువులో మృతదేహాల కోసం గాలిస్తున్నారు. దాదాపు 100 మంది గల్లంతవడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

    Sex | Covid-19: సెక్స్‌తో కరోనావైరస్‌కు చెక్.. వారానికి రెండు సార్లు చాలు.. ఇవీ ప్రయోజనాలు

    కాగా, గత ఏడాది కూడా ఇదే ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జేడ్ మైన్‌లో కొండచరియలు విరిగిపడి 110 మందికి పైగా మరణించారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయాలతో బయటపడ్డారు. 2015లో కొండచరియలు విరిగిపడి మరో 116 మంది కార్మికులు మరణించారు. అక్కడ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. గనుల యాజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోడంతో.. కార్మికులు పెద్ద మొత్తంలో మరణిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

    First published:

    ఉత్తమ కథలు