Home /News /international /

Aung San Suu Kyi : 4ఏళ్ల జైలు శిక్ష వేసిన Myanmar కోర్టు -సైనిక ప్రభుత్వ ప్రతీకారం -మాజీ అధ్యక్షుడికి కూడా

Aung San Suu Kyi : 4ఏళ్ల జైలు శిక్ష వేసిన Myanmar కోర్టు -సైనిక ప్రభుత్వ ప్రతీకారం -మాజీ అధ్యక్షుడికి కూడా

సూకీతోపాటు మయన్మార్ మాజీ అధ్యక్షుడు విన్ కూ 4ఏళ్ల జైలు

సూకీతోపాటు మయన్మార్ మాజీ అధ్యక్షుడు విన్ కూ 4ఏళ్ల జైలు

భారత్ కు పొరుగున ఉన్న మయన్మార్ లో పరిస్థితులు మరింత దిగజారాయి. అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టిన జుంటా సైన్యం.. ఆమెపై మోపిన రకరకాల అభియోగాలను కోర్టు నిర్ధారించింది. సూకీకి 4ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. మయన్మార్ మాజీ అధ్యక్షుడు విన్ మ్యింట్ కు సైతం నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ విషయాన్ని సైనిక ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.

ఇంకా చదవండి ...
భారత్ తో వెయ్యి కిలోమీటర్లకుపైగా సరిహద్దును పంచుకునే మయన్మార్ లో పరిస్థితులు మరింత అల్లకల్లోలంగా మారాయి. అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టిన సైన్యం.. సూకీపై ప్రతీకార చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మిలటరీ ప్రభుత్వం ఆమెపై 11 కేసులను పెట్టింది. వాటిని విచారించిన కోర్టు.. అంగ్‌సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం నాడు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న సూకీని కోర్టు ఆదేశాల నేపథ్యంలో జైలుకు తరలించనున్నారు. అదే సమయంలో మయన్మార్ మాజీ అధ్యక్షుడు విన్ మ్యింట్ కు సైతం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష వేసింది.

సైనిక ప్రభుత్వంపై తిరుబాటుకు ప్రోత్సహించడం ద్వారా దేశంలో హింసకు, అశాంతికి అంగ్ సాన్ సూకీ పురిగొల్పుతున్నారనే తాజా ఆరోపణలకు తోడు గతంలో ఆమె అధికారంలో ఉండగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై జుంటా సైనిక ప్రభుత్వం కేసులు పెట్టింది. వీటిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు ఇవాళ శిక్షలు ఖరారు చేసింది. గృహ నిర్బంధంలోనూ సూకీ తన పార్టీ నేతలను కలుస్తుండటంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించినదే అభియోగాలను కూడా సైనిక ప్రభుత్వం మోపింది.

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..



గ‌త ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని NLD పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే, ఆ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మిలిట‌రీ సైనిక తిరుగుబాటు చేసి పౌర ప్ర‌భుత్వాన్ని కూల్చేసింది. అప్ప‌టి నుంచి సూకీకి గృహ నిర్బంధం విధించారు. అమెపై ర‌క‌ర‌కాల అవినీతి అభియోగాలు మోపారు. కాగా, ఆ కేసుల్లోనే తాజా తీర్పు వెలువడింది. సూకీని విడుదల చేయాలంటూ ఎన్ఎల్డీ పార్టీ కార్యకర్తలు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా సైన్యం చేతుల్లో వందలమంది సూకీ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ముగ్గురు బలయ్యారు.
Published by:Madhu Kota
First published:

Tags: Myanmar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు