తెరుచుకోని విమానం ముందు టైర్ ...అయినా అద్భుతంగా ల్యాండింగ్..హ్యాట్సాఫ్ పైలట్

దీంతో ఫైలట్ సమయస్ఫూర్తికి ప్రయాణికులంతా హ్యాట్సాప్ అన్నారు. ఈ ఘటన జరిగిన సందర్భంలో ఫ్లైట్‌లో 82మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు

news18-telugu
Updated: May 12, 2019, 4:08 PM IST
తెరుచుకోని విమానం ముందు టైర్ ...అయినా అద్భుతంగా ల్యాండింగ్..హ్యాట్సాఫ్ పైలట్
మయన్మార్ ఎయిర్ లైన్స్
  • Share this:
ఈ మధ్య విమాన ప్రమాదాలు సర్వసాధారణమయిపోయాయి. తాజాగా రష్యాలో విమానం కూలి... 40కు పైగా మంది మృతిచెందారు. ఇప్పుడు మయన్మార్‌లో అతిపెద్ద విమాన ప్రమాదం తప్పింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... యాంగూన్‌లోని మాండలే ఎయిర్ పోర్టులో ఓ విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. అయితే ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం ముందు టైరు తెరుచుకోలేదు. దీంతో అలర్ట్ అయిన పైలట్‌ ఫ్లైట్‌ను చాకచక్యంగా నడిపాడు. అతిజాగ్రత్తగా విమానాన్ని కిందకు దించాడు. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారితో పాటు సిబ్బంది కూడా బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

విమానంలోని ఎయిర్ లైన్స్ సిబ్బంది


మయన్మార్ ఎయిర్ లైన్స్‌కు చెందిన యూబీ-103 విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్ ఫెయిలైంది. దీంతో అప్రమత్తమైన పైలట్ కేవలం వెనుక టైర్ల సాయంతో బ్యాలెన్సింగ్‌గా ల్యాండింగ్ చేశాడు. ఈ క్రమంలో విమానం ముందు భాగం నేలకు గుద్దుకున్నా అప్పటికే ఫ్లయిట్ పూర్తిగా ల్యాండైంది. దీంతో ఫైలట్ సమయస్ఫూర్తికి ప్రయాణికులంతా హ్యాట్సాప్ అన్నారు. ఈ ఘటన జరిగిన సందర్భంలో ఫ్లైట్‌లో 82మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. మొత్తం మీద అంతా ప్రాణాలతో బయటపడటంలో ఊపిరి పీల్చుకున్నారు.


First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...