ముస్లింలు ఉగ్రవాదులు కాదు... వారిని అలా చూడొద్దని కోరిన శ్రీలంక అధ్యక్షుడు...

Sri Lanka Bomb Blast : ఐసిస్ ఉగ్రవాదుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసన్న మైత్రిపాల సిరిసేన... ఆ శక్తి సామర్థ్యాలు శ్రీలంకకు ఉన్నాయన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 26, 2019, 2:40 PM IST
ముస్లింలు ఉగ్రవాదులు కాదు... వారిని అలా చూడొద్దని కోరిన శ్రీలంక అధ్యక్షుడు...
మైత్రిపాల సిరిసేన ఫైల్ ఫోటో (REUTERS)
  • Share this:
శ్రీలంకలో ఆదివారం ఈస్టర్ నాడు ఉగ్రవాదులు చర్చిలు, హోటళ్లపై ఆత్మాహుతి దాడులు చెయ్యడం... వాటి వెనక తామే ఉన్నామని ఐసిస్ ప్రకటించడం... న్యూజిలాండ్‌లో ముస్లింలపై దాడులకు నిరసనగా ఈ దాడులు చేసినట్లు చెప్పడంతో... సహజంగానే శ్రీలంకలో ముస్లింలపై ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన... తమ దేశ ప్రజలను ఉద్దేశించి స్పందించారు. దేశంలో మైనార్టీ వర్గంగా ఉన్న ముస్లింలను ఉగ్రవాదులుగా చూడొద్దని ప్రజలను కోరారు. కొలంబోలోని రిపోర్టర్లతో మాట్లాడిన ఆయన... దాడుల పేరుతో మత కల్లోలాలు సృష్టించవద్దని కోరారు. ఐసిస్ ఉగ్రవాదుల చర్యల్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే శక్తి సామర్ధ్యాలు తమకు ఉన్నాయన్న ఆయన... దాడుల వెనక తామే ఉన్నట్లు ఐసిస్ చెప్పుకుంటోందని అన్నారు.

Telugu News, Telugu Cinema News, Telangana Election 2018 News, Andhra News in Telugu, India News in Telugu, sri lanka attacks,terrorism,explosion in colombo,Colombo bomb blasts,colombo blast,visa,church,బాంబు పేలుడు,కొలంబో,శ్రీలంక,పేలుడు,బాంబు పేలుడు,ఉగ్రవాది,ఉగ్రవాదులు,ఐసిస్,వీసా,చర్చి,
శ్రీలంకలో పేలుళ్లు జరిగిన చర్చి (File)


దాడులపై నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని రిపోర్టర్లు ప్రశ్నించగా... అందుకు బాధ్యులైన రక్షణ శాఖ కార్యదర్శి తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఆయన రాజీనామా చేసినా... ఆ పదవిలో మరొకరు వచ్చే వరకూ ఆయనే కొనసాగుతారని తెలిపారు. పోలీస్ చీఫ్‌ను త్వరలోనే పదవి నుంచీ తప్పిస్తామన్నారు.

శ్రీలంకలో ఆదివారం ఈస్టర్ పండగ రోజున చర్చిలు, హోటళ్లలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 253 మంది చనిపోయారని శ్రీలంక ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది ఆ దేశ ప్రభుత్వం. నిన్నటి వరకూ మృతుల సంఖ్యను 359 మందిగా చెప్పిన ప్రభుత్వం... ఉన్నట్టుండి లెక్క మార్చింది. మృతుల సంఖ్యను 100కు పైగా తగ్గించింది. మృతులను లెక్కపెట్టడం కష్టమైందన్న ప్రభుత్వం... చాలా మృతదేహాలు ముక్కలు ముక్కలయ్యాయని, ఏ భాగం ఎవరిదో లెక్క తేల్చడం కష్టమైందని చెప్పింది. అందువల్ల లెక్క తేడా వచ్చిందనీ, ఇప్పుడు చెప్పిన 253 మాత్రం అత్యంత కచ్చితమైన లెక్క అని తేల్చింది. 

ఇవి కూడా చదవండి :

తాగి వస్తున్న భర్తకు తిండి పెట్టడం మానేసింది... అతను ఏం చేశాడంటే...శ్రీలంకలో చనిపోయింది 253 మందే... లెక్క తప్పిందన్న శ్రీలంక ప్రభుత్వం...

జగన్ స్విట్జర్లాండ్‌కూ... చంద్రబాబు సిమ్లాకు... సమ్మర్‌లో రిలాక్స్...

అవెంజర్స్‌కి షాక్... రిలీజ్‌కి రెండ్రోజుల ముందే పైరసీలో సినిమా మొత్తం రిలీజ్...
First published: April 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు