మలేసియా మాజీ ప్రధాని మహాతిర్ మహమ్మద్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్‌లో లక్షలాది మంది ముస్లింలను చంపే హక్కు ముస్లింలకు ఉందని వ్యాఖ్యానించినట్టు డెయిలీ మెయిల్ వెబ్ సైట్ వార్తా కథనాన్ని ప్రచురించింది. ముస్లిం మెజారిటీ దేశమైన మలేసియాకు ప్రధానిగా పనిచేసిన మహాతిర్ మహమ్మద్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కూలిపోయింది. ఫ్రాన్స్‌లోని నైన్ నగరంలోని ఓ చర్చిలో ఉగ్రవాదులు దాడి చేసి అత్యంత కిరాతకంగా ముగ్గురిని చంపారు. ఇద్దరి గొంతు కోసి చంపారు. మరో మహిళను కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేశారు. మహ్మద్ ప్రవక్త కార్టూన్లను షేర్ చేసిన ఫ్రెంచ్ టీచర్‌ను తలనరికి హత్య చేయడాన్ని తాను సమర్థించబోనన్న 95 సంవత్సరాల మహాతిర్ మహమ్మద్, ఇతరులను కించపరచడం భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి రాదన్నారు. ‘ఆగ్రహంతో ఉన్న వారు మనుషులను చంపుతారు. దానికి మతాలతో సంబంధం లేదు.’ అని వ్యాఖ్యానించారు. ఫ్రెంచ్ చరిత్రలో ఎంతోమందిని చంపిన ఆనవాళ్లు ఉన్నాయని, అందులో మెజారిటీ ముస్లింలని ఆయన కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లో లక్షలాది మందిని చంపేందుకు ముస్లింలకు హక్కు ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, ట్విటర్ నిబంధనలకు విరుద్ధంగా ద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
ముస్లింలకు కంటికి కన్ను విధానాన్ని అవలంభించలేదని ఆయన చెప్పుకొచ్చారు. ‘ముస్లింలు చేయలేదు. ఫ్రెంచ్ కూడా చేయకూడదు. ఇతరుల ఫీలింగ్స్‌ను గౌరవించేలా ఫ్రాన్స్ తన ప్రజలకు తెలియజెప్పాలి.’ అని మహాతిర్ అన్నారు. మహాతిర్ మహమ్మద్ మలేసియాకు రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. మొత్తం 24 సంవత్సరాలు ఆయన పదవిలో ఉన్నారు.
ఫ్రాన్స్‌లోని ఓ చర్చిలో ఉగ్రవాదులు దాడి చేశారు. ముగ్గుర్ని అత్యంత కిరాతకంగా చంపేశారు. అత్యంత దారుణంగా ఇద్దరి తలలు నరికివేశారు. ఫ్రాన్స్‌లోని నైస్ అనే సిటీలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ విషయాన్ని నైస్ నగర మేయర్ ధ్రువీకరించారు. ప్రార్థన కోసం చర్చికి వచ్చిన ఓ పెద్ద వయసు వ్యక్తిని అత్యంత దారుణంగా ఉగ్రవాదులు చంపేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అరెస్టు చేసినట్టు మేయర్ తెలిపారు. నిందితుడు ‘అల్లాహో అక్బర్’ అని గట్టిగా అరిచినట్టు గుర్తించామని మేయర్ తెలిపారని బీబీసీ న్యూస్ తెలిపింది. ఈ ఘటనపై ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద నిరోధక విభాగం హత్య కేసుగా నిర్ధారించి విచారణను ప్రారంభించింది. చర్చి లోపల హత్యకు గురైన ఇద్దరిలో ఓ మహిళ, మరో పురుషుడు ఉన్నారు. వారి గొంతు కట్ చేసి ఉంది. ఆ ఘటనను చూసి పారిపోవడానికి ప్రయత్నించి ఓ మహిళ దగ్గరలో ఉన్న ఓ కేఫ్‌లోకి పరిగెత్తింది. కానీ, ఉగ్రవాదులు ఆమెను వెంటాడి చంపారు. కేఫ్‌లోకి చొరబడి కత్తితో పొడిచి చంపారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉపాధ్యాయుడిని తల నరికి అత్యంత దారుణంగా హత్య చేశారు. పాకిస్తాన్‌కు చెందిన కాఫ్లాన్స్ సెయింట్ హునోరిస్‌లో ఈ ఘటన జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన క్లాస్‌లో 47 ఏళ్ల టీచర్ మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన కొన్ని కార్టూన్లను చూపించాడని, అందుకే చెచెనీయాకు చెందిన వ్యక్తి టీచర్‌ను దారుణంగా చంపాడని భావిస్తున్నారు. దీన్ని ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎటాక్ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ ప్రకటించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఫ్రాన్స్ యాంటీ టెర్రరిజం ప్రాసిక్యూటర్ విచారణ చేస్తున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మళ్లీ చర్చిలో మరో ఎటాక్ జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: France, Malaysia, Terror attack