• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • MULTIPLE EXPLOSIONS REPORTED DURING AFGHANISTAN PRESIDENT ASHRAF GHANIS OATH TAKING CEREMONY IN KABUL SK

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారం సమయంలో బాంబు పేలుళ్లు..

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారం సమయంలో బాంబు పేలుళ్లు..

ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని

తాను ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించలేదని.. కేవలం చొక్కా మాత్రమే వేసుకున్నానని ఉద్వేగానికి లోనయ్యారు ఘని. ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు.

  • Share this:
    ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్రమాణస్వీకారం వేళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఆ సమయంలో అష్రఫ్ ఘని వేదికపై ప్రసంగిస్తున్నారు. బాంబు పేలుళ్ల శబ్ధాలు విని షాక్ తిన్న ఆయన.. ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించడంతో కార్యక్రమానికి వచ్చిన వాళ్లు సైతం పరుగులు పెట్టారు. అనంతరం తేరుకున్న అధ్యక్షుడు ఘని ప్రసంగాన్ని కొనసాగించారు. తాను ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ ధరించలేదని.. కేవలం చొక్కా మాత్రమే వేసుకున్నానని ఉద్వేగానికి లోనయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. తల తెగిపడుతున్నా ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. ఐతే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఎవరు బాంబు దాడికి పాల్పడ్డారన్నది తెలియాల్సి ఉంది. కాగా, గత నెలలో అధ్యక్ష ఫలితాలు ప్రకటించగా.. అష్రఫ్ ఘని విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఘని ప్రమాణ స్వీకారం చేయడం ఇది వరసగా రెండోసారి. ఐతే అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రత్యర్థి అబ్దుల్లా ఆరోపించారు. ఆ ఎన్నికల రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు అష్రఫ్ ఘనికి పోటీగా.. తాను కూడా ప్రమాణస్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమెరికా ప్రత్యేక రాయబారి జల్మయ్ ఖలీల్జాద్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వినలేదు. సొంతంగా ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. దాంతో ఆఫ్ఘన్ రాజకీయాల్లో మళ్లీ సంక్షోభం నెలకొన్నట్లయింది.

    కాగా, ఫిబ్రవరి 29న అమెరికా, ఆప్ఘనిస్తాన్‌ తాలిబన్ల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. దశాబ్దాలుగా యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్‌లో సుస్థిర శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో అమెరికా, తాలిబన్లు చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు 14 నెలల్లో అమెరికా సైన్యాన్ని విరమించుకోనున్నట్లు ఒప్పందంలో ఉంది. ఈ ఒప్పందం నేపథ్యంలో మార్చి 10న తాలిబన్లతో ఆఫ్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంది. ఐతే అంతలోనే ఎన్నికల ఫలితాల విషయంలో అధికార, విపక్షాలు మధ్య గొడవ జరగడం.. ఆఫ్ఘనిస్తాన్‌‌లో కొత్త సమస్యకు దారితీసింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు