రెండు దశాబ్దాల తరువాత మళ్లీ తమ సొంతమైన ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొన్ని రోజులుగా ఎడతెగని కసరత్తు చేస్తున్నారు తాలిబన్లు. దేశానికి అధినేతగా ఎవరుండాలి ? కీలక పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకోసం పలువురి పేర్లు ఖరారైనట్టు వార్తలు వచ్చినా.. వారి నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా ఈ అంశంలో తాలిబన్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్‌ను దేశాధ్యక్షుడిగా, ముల్లా బరాదర్ అఖుండ్, ముల్లా అబ్దుస్ సలాంలను ఉపాధ్యక్షులుగా నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆప్ఘనిస్థాన్‌ను తమ సొంతం చేసుకున్నప్పటికి నుంచి దేశంలోని పరిణామాలను మీడియాకు వివరించే జబివుల్లా ముజ్జాహిద్దీన్, ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ ప్రతినిధిగా వ్యవహరించనున్నారు.
సిరాజ్ జుడిన్ హక్కానీ ఆఫ్ఘనిస్తాన్ కొత్త అంతర్గత మంత్రిగా ఉంటారని, ఆయనే గవర్నర్లందరినీ నామినేట్ చేస్తారని తాలిబన్ వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత పోటీలో ఉన్న సైన్యాన్ని పునరుద్ధరించడానికి హక్కానీకి సూచనలు చేయడం పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ హమీద్ ఫైజ్ కాబూల్ పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ హక్కానీ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ దేశ విదేశాంగ మంత్రి పదవి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాకీకి ఖాయమైనట్టు తెలుస్తోంది. 24 గంటల వ్యవధిలో ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ల నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
పదవీ విరమణ చేసిన ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తజికిస్తాన్‌కు పారిపోయినట్లు సూచించే నివేదికలతో పాటు పంజ్‌షీర్‌ని తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ పరిణామం చోటు చేసుకున్న తరువాత నాయకత్వానికి సంబంధించి తాలిబన్లు తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ (ఎన్‌ఆర్‌ఎఫ్) నాయకులలో ఒకరైన అహ్మద్ మసౌద్, పంజ్‌షీర్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
BJP: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీజేపీ ప్లాన్.. రంగంలోకి ముఖ్యనేతలు.. కొంతవరకు సక్సెస్ సాధించిందా ?
Heart Attack: గుండెపోటు ఎక్కువగా వచ్చేది ఈ రోజే.. అధ్యయనంలో వెల్లడి.. కారణం ఏంటంటే..
ఎవరీ మహమ్మద్ హసన్ అఖుండ్ ?
ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్ ప్రస్తుతం తాలిబాన్ యొక్క శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే సంస్థ, రెహబరి షురా లేదా నాయకత్వ మండలి అధిపతిగా ఉన్నట్టు ది న్యూస్‌లోని ఒక నివేదిక పేర్కొంది. అతను తాలిబాన్ల జన్మస్థలం కాందహార్‌కు చెందినవాడు. అతడు సాయుధ ఉద్యమ వ్యవస్థాపకుల ఒకడు. పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ కూడా నిన్న కాబూల్‌లో ఆఫ్ఘనిస్తాన్ మాజీ ప్రధాని గుల్బుద్దీన్ హెక్‌మత్యర్‌ను కలిశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై సమావేశం దృష్టి సారించిందని ఆఫ్ఘన్ న్యూస్ పోర్టల్ నివేదించింది. ఆగస్టు 15న తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan