గుండెలు పిండేసే కథ... కొడుకు హార్ట్‌బీట్‌ను మరో మహిళ హృదయంలో విన్న తండ్రి

Heartbeat : చనిపోయిన కొడుకు గుండెను... మరో మహిళకు విజయవంతంగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు డాక్టర్లు. ఆ తర్వాత ఆ గుండె కొట్టుకునే వేగాన్ని విని కంటతడి పెట్టారు తండ్రి.

news18-telugu
Updated: February 17, 2020, 12:51 PM IST
గుండెలు పిండేసే కథ... కొడుకు హార్ట్‌బీట్‌ను మరో మహిళ హృదయంలో విన్న తండ్రి
గుండెలు పిండేసే కథ... కొడుకు హార్ట్‌బీట్‌ను మరో మహిళ హృదయంలో విన్న తండ్రి (credit - FB - Summer MJ Mossbarger)
  • Share this:
Heartbeat : ట్వీట్‌లో ఉన్న రెండు ఫొటోల్లోని ఒక దాంట్లో... జోర్డాన్ స్పాన్... స్టెథస్కోప్‌ను తన చెవులకు పెట్టుకున్నాడు. మరోవైపు భాగాన్ని క్రిస్తీ తన చెస్ట్‌కి ఆనించింది. తద్వారా వచ్చే హృదయ లయలను (Heartbeat)ను ఆ తండ్రి వింటూ... కన్నీటి సంద్రమయ్యాడు. ఎందుకంటే... ఆ కొట్టుకుంటున్న గుండె ఆమెది కాదు. జోర్డాన్ కొడుకుది. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా... అతని కొడుకు గుండెను... ఆమెకు విజయవంతంగా అమర్చారు. ఆ హృదయ స్పందనను వింటూ... మరోసారి తన కొడుకును గుర్తు చేసుకుంటూ... కన్నీరు పెట్టారు జోర్డాన్. 21 ఏళ్ల కొడుకు మాథ్యూ... 2018లో ఓ రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఆ కుర్రాడు ఇంటికి వస్తుండగా... ఓ వెహికిల్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలై... 10 రోజులపాటూ మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. కొడుకు దూరమై 15 నెలలుగా బాధపడుతున్న ఆ తండ్రికి... ఇప్పుడు హృదయ స్పందనలు కాస్తంత సాంత్వన కలిగించాయి.


మాథ్యూ చనిపోయిన తర్వాత అతని అవయవాలు, చర్మం, కణజాలాల్ని డాక్టర్లు భద్రపరిచారు. తద్వారా ఎంతో మందికి ప్రాణం పోయాలనుకున్నారు. అలా అవయవాలు పొందిన వారిలో 51 ఏళ్ల క్రిస్తీ రిచర్డ్ రస్‌కి గుండెను అమర్చారు. ఆపరేషన్ తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నాక... ఆమెను కలిశారు జోర్డాన్ స్పాన్. తన కొడుకు గుండె లయను ఓసారి వినాలని ఉందన్నారు. వెంటనే ఒప్పుకున్న ఆమె... స్టెతస్కోప్ పట్టుకుంది. లబ్ డబ్ మని ఆ గుండె కొట్టుకుంటుంటే... తన కొడుకును తలచుకుంటూ... అక్కడే కుప్పకూలి ఏడ్చేశారు జోర్డాన్.

ఈ ఎమోషనల్ పరిస్థితుల్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు సమ్మర్ మొస్బర్గర్. ప్రతీ ఒక్కరూ తమ అవయవాల్ని దానం చెయ్యాలనీ, తద్వారా ఇతరులకు ప్రాణం పోసినట్లవుతుందని సమ్మర్ మొస్బర్గర్ కోరుతున్నారు. జోర్డాన్ కోలుకున్నాక... మీ కొడుకు హార్ట్ బీట్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించిందని అడిగితే... తన కొడుకును మరోసారి చూసినట్లు, కలిసినట్లు అనిపించిందని తెలిపాడు జోర్డాన్. మరో మహిళలో తన కొడుకు హృదయం సజీవంగా ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు.




హార్ట్ అమర్చిన తర్వాత ఏడాది పాటూ క్రిస్తీకి... తనకు ఎవరి గుండెను అమర్చారో డాక్టర్లు చెప్పలేదు. ఇప్పుడు అసలు విషయం తెలిసి... ఆమె కూడా కన్నీరు పెట్టారు. తన గుండె ఎప్పటికీ తనది కాదన్న క్రిస్తీ... ఆ హృదయ స్పందన ఎప్పుడు వినాలని అనిపించినా... వినిపించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పడంతో... నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. ఈ మొత్తం ఘటన ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాను కదిలిస్తోంది. అందరి గుండెల్నీ పిండేస్తోంది.
First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు